గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పద్మావత్ హీరోయిన్ ఒక యాసిడ్ దాడికి గురైన అమ్మాయి పాత్రలో నటించడానికి రెడీ అయ్యింది. రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కించనున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దీపిక పడుకొనే రెగ్యులర్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. జనాలను ఆకట్టుకునే విధంగా పాత్రలను చేస్తూ మెప్పిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పద్మావత్ హీరోయిన్ ఒక యాసిడ్ దాడికి గురైన అమ్మాయి పాత్రలో నటించడానికి రెడీ అయ్యింది. 

రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇకపోతే దీపిక సొంతంగా తన సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్ పాత్రను ఆధారంగా చేసుకొని సినిమా కథ ఉంటుందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 

ముంబైకి చెందిన లక్ష్మి అగర్వాల్ 2005లో 15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి గురైంది. తనను ప్రేమించలేదని నయీమ్ ఖాన్ అనే వ్యక్తి లక్ష్మిపై యాసిడ్ దాడి చేశాడు. అయితే ఎంతో మనోవేధనలో కూడా లక్ష్మి దైర్యంగా నిలబడి కొత్త తరహాలో జీవితాన్ని గెలిచి అందరికి ఆదర్శంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె యాసిడ్ ఘటనలు జరగకూడదని ప్రచారాలను మీటింగ్ లను నిర్వహించి యాసిడ్ బాధితులకు సైతం అండగా నిలిచింది.