స్టార్ హీరోయిన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది దీపికా పదుకొనె లాంటి ఆల్ ఇండియా స్టార్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా ఉన్న దీపికా...  పబ్లిక్ ప్రదేశాలలో కనిపిస్తే చాలు, మీడియా, ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టేస్తారు. సెల్ఫీల కోసం, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడిపోతారు. అందుకే ఆమె బలమైన వ్యక్తిగత సిబ్బందిని మైంటైన్ చేస్తూ ఉంటారు. 


ఎంత మంది గార్డ్స్ ఉన్నా ఒక్కోసారి అభిమానుల మధ్య నలగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. దీపికా అభిమానుల మధ్య చిక్కుకుపోయారు. ఆమె ఖరీదైన బ్యాగ్ సైతం మనుషులలో చిక్కుకుపోయింది. అత్యంత ప్రాయాస మధ్య గార్డ్స్ సహాయంతో దీపికా, వందల మంది జనాల నుండి బయటపడ్డారు. అయితే అభిమానులు దీపికాకు అంత అసౌకర్యం కలిగించినా, కోపడకుండా, చిన్న స్మైల్ ఇచ్చి అక్కడనుండి వెళ్లిపోయారు ఆమె. 


మరో వైపు దీపికా... ప్రభాస్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రానికి దీపికాను ఎంపిక చేశారు. నిర్మాత అశ్వినీ దత్ దాదాపు రూ. 500కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అలాగే కపిల్ దేవ్ బయోపిక్ 83మూవీలో దీపికా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో కపిల్ రోల్ ఆమె భర్త రణ్వీర్ సింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.