బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె పేరెంట్స్ కి కరోనా సోకింది. దీపికా తండ్రి, లెజెండరీ బ్యాడ్మింటన్‌ ఆటగాడు ప్రకాష్‌ పదుకొనె(65)కి, దీపికా తల్లి ఉజ్జాల, దీపికా సోదరి అనిషాలకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. వారి ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రకాష్‌ పదుకొనె ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ని బెంగూళూరులోని ప్రముఖ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, క్రమంగా కోలుకుంటున్నట్టు వారి సన్నిహితులు తెలిపారు. ప్రకాష్‌ పదుకొనె భార్య ఉజ్జాల, కూతురు అనిషాలకు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని, ప్రకాష్‌ కి జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుందని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తార`ని ప్రకాష్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌ విమల్‌ కుమార్‌ తెలిపారు.

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ని వివాహం చేసుకుని ముంబయిలో సెటిల్‌ అయిన దీపికా పదుకొనె ప్రస్తుతం `83`, `పఠాన్‌`, శకున్‌ బట్రా చిత్రాల్లో నటిస్తుంది.  ప్రకాష్‌ పదుకొనె లెజెండరీ బాడ్మింటన్‌ ప్లేయర్‌ అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు ఇండియాకి అనేక కప్‌లు తీసుకొచ్చారు.