Asianet News TeluguAsianet News Telugu

దీపికా పదుకొనెకి అరుదైన గౌరవం.. గ్లోబల్‌ పురస్కారం..

ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది మూడు వేలకుపైగా నామినేషన్లు వచ్చాయి. నటనకు సంబంధించిన ఉత్తమ నటిగా దీపికా పదుకొనెకి అవార్డు దక్కడం విశేషం. 

deepika padukone facilitate with globle award
Author
Hyderabad, First Published Oct 3, 2021, 4:39 PM IST

బాలీవుడ్‌(bollywood)లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది దీపికా పదుకొనె(deepika padukone). గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా దారిలో హాలీవుడ్‌ చిత్రాలు కూడా చేస్తూ సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకొనెకి ఓ అరుదైన గౌరవం దక్కింది. గ్లోబల్‌ అవార్డుని సొంతం చేసుకుంది.  ప్రతిష్టాత్మక `ది గ్లోబల్‌ అచీవర్స్ అవార్డు 2021` ని దక్కించుకుంది.  ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అవార్డు దీపికాకి దక్కడం విశేషం. 

ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది మూడు వేలకుపైగా నామినేషన్లు వచ్చాయి. నటనకు సంబంధించిన ఉత్తమ నటిగా దీపికా పదుకొనెకి అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డుకి అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా, బిజినెస్‌మేన్‌ జెఫ్‌ బెజోస్‌, క్రీడాకారుడు క్రీస్టీనో రోనాల్డో లాంటి హేమాహేమీలతో కలిసి దీపికా ఎంపికవ్వడం విశేషం. ఇండియా నుంచి ఈ అవార్డుకి ఎంపికైన తొలి మహిళ దీపికా కావడం విశేషం. 

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనె ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతుంది. అందులో భాగంగా దీపికా ఇప్పుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి `ఫైటర్‌`, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి `ది ఇంటర్న్`, భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `83` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు ఓ హాలీవుడ్‌ చిత్రం కూడా దీపికా చేతిలో ఉంది. `రామ్‌లీలా`, `బాజీరావు మస్తానీ`,`పద్మావత్‌` చిత్రాలతో దీపికా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios