బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కో స్టార్ సిద్దాంత్ చతుర్వేదితో సన్ సెట్ ఆస్వాదిస్తున్నారు. ఓ మూవీ షూటింగ్ కోసం అలీభాగ్ వెళ్లిన దీపికా పదుకొనె సముద్రం మధ్యలో.. విలాసవంతమైన షిప్ టాప్ పైకి చేరి , అందమైన సూర్యాస్తమయంలో సేదదీరారు. దర్శకుడు శకున్ బాత్రాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో దీపికా, సిద్దాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 

ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా తాజా షెడ్యూల్ కోసం అలీభాగ్ వెళ్లడం జరిగింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె, సిద్దాంత్ చతుర్వేది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న దీపికా, విచారణకు హాజరు కావడం జరిగింది. ఆ సమయంలో మానసికంగా దీపికా వేదనకు గురయ్యారు. 

ఇక దీపికా టాలీవుడ్ ఎంట్రీ కూడా సర్వం సిద్ధం అయ్యింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.