Asianet News TeluguAsianet News Telugu

#PawanKalyan:పవన్, సుజీత్ చిత్రం ప్రీ లుక్ డీకోడ్ చేస్తే...ఇదీ మేటర్

 పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  హీరో  'సాహో' ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.  ఈ రోజు చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.

Decoding of Pawan Kalyan,Sujeeth Film Pre look
Author
First Published Dec 4, 2022, 5:48 PM IST


పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నప్పటికీ.. ఆయన సినిమాల లైనప్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉంటోంది.  ఏ హీరోలు ఇంత త్వరగా సినిమాల మీద సినిమాలు ప్రకటించడం లేదంటే అతిశయోక్తి కాదు. అల్రెడీ పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే రెండు మూడు ఓకే చేసి ఉన్నారు. ఈలోపులో యంగ్  డైరెక్టర్ సుజిత్ మరో సినిమాని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ప్రభాస్ తో చేసిన సాహు తో హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలతో మెప్పించిన సుజిత్.. తర్వాత గ్యాప్ తీసుకుని  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం అందరిలో ఆనందం కలిగిస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా అదిరిపోయే యాక్షన్ సినిమా వస్తుందంటున్నారు.
 
ఈరోజు  దానయ్య ఎంటర్టైన్మెంట్ లో పవన్ కళ్యాణ్-సుజిత్ కలయికలో రాబోతున్న మూవీ అనౌన్సమెంట్ చేసారు మేకర్స్. పవన్ కల్యాణ్-సుజిత్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని పోస్టర్ ద్వారా రివీల్ చేసారు. OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అంటూ సినిమాపై ఆసక్తితో పాటుగా అదిరిపోయే ఓ హిట్ కూడా ఇచ్చేసారు. ఈ నేపధ్యంలో అభిమానులు ఈ పోస్టర్ ని డీకోడ్ చేస్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం.

అతన్ని #OG అని పిలుస్తారు అని పోస్టర్ పై ఉంది. అంటే ఒరిజనల్ గ్యాంగస్టర్ అని..బాస్ ఆఫ్ ఆల్ అని అర్దం ఉంది. అలాగే పోస్టర్ బ్యాక్ గ్రౌండ్  జపనీస్ ఆర్టిస్టిక్ ప్లాగ్ ఉంది. అలాగే జపాన్ టెక్ట్స్ రాసి ఉంది. దాన్ని ట్రాన్సలేట్ చేస్తే ..“Fire Storm is Coming.” అని వస్తుంది.

మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఏమిటి అంటే ఈ పోస్టర్ లో బుద్ద స్టాట్యూ ఉంది. బుద్దుడు అంటే శాంతి అని అర్దం. కానీ ఇదో గ్యాంగస్టర్ డ్రామా, వైలెన్స్ ఉన్న సబ్జెక్టు. కానీ శాంతిని చూపటం అంటే రెండు బ్లెండ్ చేస్తున్నారని తెలుస్తోంది.  అదే కాంప్లిక్ట్స్, కథలో ఉండే ఛాలెంజ్ అని అర్దమవుతోంది. మార్షల్ ఆర్ట్స్ చుట్టు తిరిగే కథ అంటున్నారు. 

మరో ఆసక్తికరమైన ఎలిమెంట్ ఏమిటీ అంటే... పోస్టర్ లో పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని నిల్చున్న స్టిల్ చూపించగా.. పవన్ వెనుక నీడ మాత్రం ఓ పెద్ద గన్‌లా కనిపిస్తుండడం పవన్ ఫాన్స్ కి కిక్ ఇస్తుంది. అంటే  ఈ చిత్రం ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్దమవుతోంది.  జపాన్ జాతీయ జెండాలో సూర్యుడు ఎర్రటి రంగులో ఉంటాడు. నేపథ్యం అంతా తెల్లగా ఉంటుంది. కానీ, ఈ పోస్టర్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఎర్రటి నేపథ్యంలో ఆరెంజ్ కలర్ సూర్యుడిని చూపించారు.  
 
అందుతున్న సమాచారం మేరకు...సుజిత్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, నటుల ఎంపిక పూర్తి చేసి ఈ నెలలోనే పవన్ తో కలిసి సెట్స్ లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios