విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా సినిమా టీజర్ ని నాలుగు భాషల్లో విడుదల చేశారు. ఇందులో విజయ్, రష్మిక ల లిప్ లాక్ సీన్ వైరల్ గా మారింది.

టీజర్ కి అన్ని భాషల నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కన్నడ ప్రేక్షకులు మాత్రం టీజర్ పై ఫైర్ అవుతున్నారు. దానికి కారణం రష్మిక పాస్ట్ లైఫ్ అనే చెప్పాలి. కన్నడ హీరో రక్షిత్ ని నిశ్చితార్ధం చేసుకొని పెళ్లి బ్రేక్ చేసిన రష్మికపై రక్షిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

వాళ్లకు ఛాన్స్ దొరుకుతోన్న ప్రతీసారి రష్మికని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్'లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్ ఉండడం.. రక్షిత్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. 

కొందరు హద్దులు దాటి మరీ కామెంట్లు పెడుతున్నారు. కానీ రష్మిక ఈ విషయాలను పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు.