విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా బాధ్యతలు పూర్తిగా హీరో విజయ్ దేవరకొండ తన భుజాలపై వేసుకున్నాడని టాక్.

కేవలం తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసి వదిలేయకుండా.. ఎడిటింగ్, బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నాడని సమాచారం. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే ఈ సినిమా కోసం రీషూట్ లు నిర్వహించారు. పలు వెర్షన్ లు కట్ చేశారని టాక్. తాజాగా మరోసారి ఒకట్రెండు  రోజులు ఆర్టిస్ట్ ల డేట్స్ తీసుకొని రీషూట్ నిర్వహించారని సమాచారం. 

హీరోయిన్ రష్మిక వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ డేట్స్ లు అడ్జస్ట్ చేసుకొని 'డియర్ కామ్రేడ్' రీషూట్ లకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు రీషూట్ లు ఏంటి..? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.