టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ డియర్ కామ్రేడ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక విజయ్ సరసన నటించడం మెయిన్ హైలెట్. గీత గోవిందం హిట్ అనంతరం ఈ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

అయితే సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారట. యూఎస్ లో విజయ్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ గా ఉండడంతో గత సినిమాలకంటే ఎక్కువ స్థాయిలో అమెరికన్ సెంటర్స్ లో సినిమా ప్రదర్శించబడనుంది. అంటే స్టార్ హీరోల తరహాలో విజయ్ ఈ సారి డియర్ కామ్రేడ్ ద్వారా $1 మిలియన్ మార్క్ ని ఈజీగా అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. 

సినిమాకు సంబందించిన అన్ని బిజినెస్ పనులు ఇప్పటికే ముగిశాయి. దర్శకుడు భరత్ కమ్మా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి ఫైనల్ అవుట్ ఫుట్ ని ప్రతి రోజు పరీక్షించుకుంటున్నాడు. డబ్బింగ్ లో ఇటీవల తలెత్తిన లోపాలను చిత్ర యూనిట్ సరిచేసుకున్నట్లు సమాచారం.