బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’సినిమాను హిందీలో రీమేక్‌ చేయబోతున్నానంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా ఇది. భరత్‌ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక టాక్ డివైడ్ గా రావటంతో ...బాలీవుడ్ లో రీమేక్ చేయటానికి కరణ్ జోహార్ వెనకాడతారు అని వార్తలు వచ్చాయి. కేవలం  పబ్లిసిటీ స్టంటే అని అన్నారు. అయితే కరణ్ జోహార్ మాత్రం ఈ రీమేక్ పనులు మొదలెట్టేసాడని తెలుస్తోంది.

అలాగే తెలుగులో మైనస్ అనుకున్న ఎపిసోడ్స్ ని తొలిగిస్తున్నారట. స్క్రీన్ ప్లే మార్చమని రైటర్స్ కు పురమాయించారట.  ఈ కథని హీరో వైపు నుంచి కాకుండా హీరోయిన్ వైపు నుంచి అంటే బాబి కథ గా కాకుండా లిల్లీ కథగా చెప్పమని స్క్రిప్టు రైటర్స్  కు చెప్పి రెడీ చేయిస్తున్నారట. అంటే బాలీవుడ్ లో ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ గా రానుందన్నమాట. మీటూ ఉద్యమం వచ్చిన నేపధ్యంలో అక్కడ ఈ సినిమా బాగా వర్కవుట్ అవుతుందని, మెట్రో ఆడియన్స్ కు బాగా పడుతుందని భావిస్తున్నారట. 

‘అర్జున్ రెడ్డి’రీమేక్ హిందీలో వర్కవుట్ అయినట్లుగానే ఈ సినిమా ఆడుతుందని భావిస్తున్నారు ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా ‘ధడక్’ ఫేమ్  జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్  చేయనున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తోంది. అక్కడున్నది కరణ్ జోహార్ కావటంతో మీడియా మామూలుగా లేదు.