యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్, వెంకీ కుడుముల దర్శకత్వంలో, మైత్రి మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్, వెంకీ కుడుముల దర్శకత్వంలో, మైత్రి మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జివి ప్రకాష్ తమిళంలో హీరోగా కూడా రాణిస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ కింగ్స్టన్ చిత్రం మార్చి 7న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

తమ చిత్ర సంగీత దర్శకుడు నటించిన చిత్రం కావడంతో కింగ్స్టన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెంకీ కుడుముల, నితిన్, మైత్రి నిర్మాత రవిశంకర్ అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవిశంకర్ మాట్లాడుతూ రాబిన్ హుడ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ చేశారు. 

మహేష్ బాబు, ఇలియానా తర్వాత నితిన్, శ్రీలీల

రాబిన్ హుడ్ మూవీలో నితిన్ చాలా అందంగా, స్టైలిష్ గా కనిపిస్తారు. ఇప్పుడే ఫైనల్ కాపీ చూశాను. మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. నితిన్, శ్రీలీల లాంటి పెయిర్ ని చూసి చాలా కాలం అవుతోంది. ఇలాంటి పెయిర్ ని చివరగా పోకిరి చిత్రంలోనే చూశాను. ఆ మూవీలో మహేష్ బాబు, ఇలియానా ఎంత అందంగా కనిపించారో ఈ మూవీలో నితిన్, శ్రీలీల అంతకి మించి అందంగా కనిపిస్తారు అని రవిశంకర్ అన్నారు. 

డేవిడ్ వార్నర్ ఎంట్రీ 

నితిన్ అడ్డుకుని సార్ ఇది మన సినిమా ఈవెంట్ కాదు.. దయచేసి కింగ్స్టన్ గురించి మాట్లాడండి అని సరదగా తెలిపారు. యాంకర్ వచ్చి రాబిన్ హుడ్ గురించి ఇంకేమైనా లీక్ చేయాలి అని అడగడంతో రవిశంకర్ క్రేజీ మ్యాటర్ చెప్పేశారు. ఈ మూవీతో డేవిడ్ వార్నర్ చిన్న పాత్రలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. డేవిడ్ వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ తమ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాకి, తెలుగు సినిమాకి పరిచయం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 

గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ తెలుగువారికి బాగా చేరువయ్యాడు. వార్నర్ తరచుగా సోషల్ మీడియాలో తెలుగు హీరోల డైలాగులు చెబుతూ రీల్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. తెలుగు అభిమానులు వార్నర్ ని డేవిడ్ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు.