Asianet News TeluguAsianet News Telugu

స్టేడియంలోనూ `పుష్ప`ని వదలని డేవిడ్‌ వార్నర్‌.. ఫీల్డింగ్‌ చేస్తూ శ్రీవల్లి పాటకి స్టెప్పులు.. వీడియో వైరల్‌

`అల వైకుంఠపురములో` పాటలకు స్టెప్పులేసి వాహ్‌ అనిపించాడు ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. బన్నీపై ఉన్న ప్రేమని  తన అభిమానాన్ని, తన మ్యానరిజాన్ని చూపించాడు.

david warner dance in cricket stadium for pushpa movie song video viral arj
Author
First Published Oct 28, 2023, 3:56 PM IST

అల్లు అర్జున్‌కి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా అభిమానులున్నారు. `పుష్ప` చిత్ర ప్రభావం అంతగా చూపించింది. చాలా మంది ఈ సినిమాలోని `తగ్గేదెలే` అనే మ్యానరిజాన్ని, శ్రీవల్లి పాటని బాగా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా బన్నీ ఏం చేసినా ఫాలో అయ్యే అంతర్జాతీయ సెలబ్రిటీలున్నారు. వారిలో ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఆయన చాలా కాలంగా బన్నీని బాగా ఫాలో అవుతున్నాడు. 

`అల వైకుంఠపురములో` పాటలకు స్టెప్పులేసి వాహ్‌ అనిపించాడు. ఇంట్లో బన్నీ పాటలకు రీల్స్ చేసి వైరల్‌గా మారారు. బన్నీపై ఉన్న ప్రేమని చాటి చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు మరోసారి తన అభిమానాన్ని, తన మ్యానరిజాన్ని చూపించాడు. అయితే అయితే ఏకంగా క్రికెట్‌ స్టేడియంలో `పుష్ప` సినిమా పాటకి డాన్సు చేయడం విశేషం. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ జరుగుతుంది. ఇందులో ఓ మ్యాచ్‌ సందర్భంలో వార్నర్‌ డాన్స్ చేయడం విశేషం. 

మ్యాచ్‌ మధ్యలో `పుష్ప`లోని శ్రీవల్లి పాటని ప్లే చేశారు. దీంతో బార్డర్‌ లైన్‌ వద్ద ఉన్న వార్నర్‌.. స్టేడియంలోనే శ్రీవల్లి పాటకి డాన్సు చేశారు. ఈ పాటలో బన్నీ కాలు కుంటుతూ  డాన్సు చేస్తాడు. స్టేడియంలోనూ వార్నర్‌ అలానే కుంటుతూ డాన్సు చేసి అభిమానులను అలరించారు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో, ఆయన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే వార్నర్‌ శుక్రవారం తన 37వ బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బర్త్‌ డే విషెస్‌ తెలియజేయడం విశేషం. వార్నర్ తగ్గేదేలే అనే అభినయం ఉన్న ఫోటో షేర్ చేస్తూ బన్నీ ఇలా విష్ చేశాడు. `క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ కి జన్మదిన శుభాకాంక్షలు. నీ కలలు అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా` అంటూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios