ఈ సినిమా ఆగిపోయిందని ఈ మధ్య రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ రూమర్లను చిత్ర యూనిట్ కొట్టి పారేసింది. కాకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లేవు. అందరూ ఈ సినిమాని మర్చిపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని గుర్తు చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.


తన విలక్షణమైన న‌ట‌న‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న స‌త్యదేవ్ హీరోగా, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీబ్యూటి త‌మన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా రెడీ అయిన సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్‌టైల్’కు ఇది రీమేక్. స‌త్యదేవ్‌, త‌మన్నా తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ రీమేక్ మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే, ఈ సినిమా ఆగిపోయిందని ఈ మధ్య రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ రూమర్లను చిత్ర యూనిట్ కొట్టి పారేసింది. కాకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లేవు. అందరూ ఈ సినిమాని మర్చిపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని గుర్తు చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. వాలంటైన్ డే కానుకగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు.

 డైరెక్టర్ నాగశేఖర్ మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్పటికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు.

 ఈ సినిమాను నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమాపై ప్రత్యేక ఆస‌క్తి నెల‌కొంది.