మాస్ సినిమాలలో నటించే ధనుష్, క్లాస్ సినిమాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా ప్రకటన వెలువడి చాలా కాలం అయ్యింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై వార్తలు లేవు. కానీ తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. 

తెలుగు స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఆ మధ్యన హీరో ధనుష్‌తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేసేసారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. సినిమా ప్రారంభించలేదు. దాంతో ధనుష్ ఫ్యాన్స్ దర్శకుడు శేఖర్ డైరెక్షన్ లో తమ హీరో సినిమా ఉందా లేదా అనే డౌట్స్ సోషల్ మీడియాలో ఎక్సప్రెస్ చేస్తున్నారు. మరో ప్రక్క ఇంకా ఎంత లేట్ అవుతుందో అంటూ ఆందోళన పడుతున్నారు. మీడియా కూడా అసలు ఈ ఏడాది వస్తుందా లేదా అంటుండగా... ఈ ఏడాది వీరి కాంబోలో సినిమా రావడం కష్టమే అని వినిపిస్తోదంటూ ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

సాధారణంగా దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా సినిమాకి మద్య చాలా గ్యాప్ తీసుకుంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన సినిమా ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్, స్క్రిప్టు వర్క్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సినిమాని దసరా సందర్బంగా అక్టోబర్ 5 పూజ జరపబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్ళబోతున్నారు. ధనుష్ తన పాత్రను తమిళ ఆడియన్స్ కు నచ్చే విధంగా మార్చాలని కోరినట్టు,అందుకే లేటైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శేఖర్ కమ్ముల ధనుష్ చెప్పినట్టు కథలో మార్పులు చేసి స్క్రిప్టు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదేమీ అఫీషియల్ సమాచారం కాదు. 

 శేఖ‌ర్ క‌మ్ముల త‌న ఈ ప్రాజెక్ట్స్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ధ‌నుశ్‌తో తాను చేయ‌బోయేది థ్రిల్ల‌ర్ మూవీ అని తెలిపారు. మ‌ల్లీ లింగ్వువ‌ల్ మూవీగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాన‌ని తెలిపారు. సెన్సిబుల్ సినిమాలు చేయ‌డంలో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌కు ఓ ప్ర‌తేక‌త ఉంది. ఆయ‌న తెర‌కెక్కించిన ఆనంద్‌, హ్యాపీడేస్‌, లైఫ్ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి ఫ్యామిలీ చిత్రాల‌తో పాటు లీడ‌ర్ వంటి పొలిటిక‌ల్ చిత్రం కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఫిదా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ల‌వ్‌స్టోరి. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. ఈ సినిమా కూడా ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంది.

ఈ మధ్య కాలంలో ధనుష్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. వరుస విజయాలతో జోరుమీదున్న శేఖర్ కమ్ముల ధనుష్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. హీరోలను సింపుల్ గా చూపించే శేఖర్ కమ్ముల ధనుష్ ను కూడా అదే విధంగా చూపిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

మరో ప్రక్క తాను గ‌తంలో రానాతో చేసిన లీడ‌ర్ సినిమాకు సీక్వెల్‌ను చేయాల‌నుకుంటున్నాన‌ని, ఆ విష‌యంపై త్వ‌ర‌లోనే రానాను క‌లుస్తాన‌ని శేఖ‌ర్ క‌మ్ముల తెలిపారు. అంటే అంతా ఓకే అయితే లీడ‌ర్ 2 రావ‌డం ప‌క్కా. మ‌రి ఈ సీక్వెల్ కొన‌సాగింపుగా ఉంటుందా? లేదా కొత్త పొలిటిక‌ల్ యాంగిల్‌లో సాగుతుందా? అని చూడాలి.