టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ అందింది. మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ అఫిషియల్ డేట్ ను అనౌన్స్ చేశారు.   

పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ ‘హంట్’(Hunt)తో ఆకట్టుకోబోతున్నాడు యాక్షన్ హీరో సుధీర్ బాబు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. రీసెంట్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేపోయిందీ చిత్రం. దీంతో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ పెట్టారు హీరో సుధీర్ బాబు. అందులో ఒకటైన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘హంట్’. ఈ చిత్ర అనౌన్స్ మెంట్ నుంచి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్స్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు మహేశ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.

ఇప్పటికే పలు పోస్టర్లను పంచుకుంటూ అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు. హంట్ టీజర్ (Hunt Teaser)ను రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. సెప్టెంబర్ 28న టీజర్ విడుదల చేయనున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు. దీంతో సుధీర్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టే సుధీర్ బాబు ‘హంట్’ టీజర్ లో ఎలా అలరించబోతున్నట్టు తెలిపారు. ఈ యాక్షన్ ఫిల్మ్ లో సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తుండగా.. దర్శకుడు మహేష్‌ తెరకెక్కిస్తున్నారు. 

భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మాతగా వి. ఆనంద ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించగా.. దాదాపు తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్ లో నటిస్తున్నారు.. మరోవైపు టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీకాంత్ (Srikanth) కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా అఫిషియల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. అలాగూ 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, గోపరాజు రమణ, 'జెమినీ' సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు.

వరుపెట్టి చిత్రాల్లో నటిస్తున్న సుధీర్ బాబు ఈ ఏడాది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం ‘హంట్’ చిత్రంతో పాటు మరోచిత్రంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లోనూ నటిస్తున్నారు. అదేవిధంగా ‘మామా మచ్ఛీంద్ర’ అనే చిత్రం కూడా సుధీర్ బాబు ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటోంది. ఇలా వరస పెట్టి చిత్రాల్లో నటిస్తున్న సుధీర్ ఒక్క హిట్ కోసం చూస్తున్నారు. ‘హంట్’తో ఆయన ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి.

Scroll to load tweet…