మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగష్టు 11న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అయితే మెగాస్టార్ మాత్రం విరామం తీసుకునేలా కనిపించడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగష్టు 11న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అయితే మెగాస్టార్ మాత్రం విరామం తీసుకునేలా కనిపించడం లేదు. భోళా శంకర్ రిలీజైన వెంటనే మరో చిత్రాన్ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

చిరంజీవి తదుపరి చిత్రం బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఉండబోతోంది. అయితే ఈ చిత్ర కథపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మలయాళం లో విజయం సాధించిన మోహన్ లాల్ బ్రో డాడీ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతుంటే.. మరికొందరు కేవలం ఆ చిత్ర అంశం మాత్రమే ఉంటుందని.. మిగిలిన కథని కళ్యాణ్ కృష్ణ మార్చేశారని అంటున్నారు. 

మరో ఆసక్తికర ప్రచారం కూడా సాగుతోంది. ఈ చిత్రానికి బేసిక్ లైన్ ని చిరంజీవి ఇచ్చారని అంటున్నారు. ఫ్యామిలీ అంశాలు, కామెడీ ఉండేలా చిరు ఒక లైన్ చెప్పగా దానిని కళ్యాణ్ కృష్ణ డెవలప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని మాత్రం ఒక ప్రత్యేకమైన రోజునే లాంచ్ చేయాలనీ మెగా డాటర్ సుష్మిత కొణిదెల డిసైడ్ అయినట్లు టాక్. 

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న ఈ చిత్రాన్ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ చిత్రానికి నిర్మాత సుష్మితనే కావడం విశేషం. సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లోనే చిరంజీవి చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిషని ఫైనల్ చేశారు. స్టాలిన్ తర్వాత చిరు, త్రిష కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.