Asianet News TeluguAsianet News Telugu

‘వివేకం’స్క్రీనింగ్ ఆపేయండంటూ హైకోర్టులో పిటిషన్‌, ఎవరు వేసారంటే...

ఐ-టీడీపీ ప్రోత్సాహంతో ఈ సినిమా  అందుబాటులో ఉందని, సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ సినిమా విడుదలయిందని, ..

Dastagiri Appeals to High Court to Stop Screening of Vivekam Movie jsp
Author
First Published Apr 2, 2024, 7:08 AM IST


ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న  నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా మాధ్యమం ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో రూపొందిన వివేకం సినిమా  ఇప్పుడు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని బాగా ఇబ్బంది పెట్టినట్లుంది. దాంతో దస్తగిరి హైకోర్టును ఆశ్రయించాడు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

యూట్యూబ్‌, ఓటీటీలలో వివేకం సినిమా ప్రదర్శనను నిలిపివేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ.. వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తాను సీబీఐకి, పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ సినిమా తీశారని.. ఇందులో తన పేరును అపకీర్తి పాల్జేసేలా పేర్కొన్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని కోరారు. 

ప్రస్తుతం వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉందని, కానీ ఈ సినిమాలో తన పేరును వాడుకున్నారని కాబట్టి సినిమా ప్రదర్శనను ఆపేయాలని దస్తగిరి హైకోర్టును కోరారు. కాగా దస్తగిరి జై భీం భారత్ పార్టీ అభ్యర్థిగా పులివెందుల నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దస్తగిరి తరపున లాయర్ జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించడం గమనార్హం. కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి ఈ సినిమా ప్రదర్శిస్తుందని జడ శ్రవణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. 

ఐ-టీడీపీ ప్రోత్సాహంతో ఈ సినిమా  అందుబాటులో ఉందని, సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ సినిమా విడుదలయిందని, పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఈ సినిమా ప్రదర్శినతో పిటిషనర్ నష్టపోయే అవకాశం ఉందని, ఇది పిటిషనర్ హక్కులకు భంగం కలిగించడమేనని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్‌ని ప్రతివాదులుగా చేర్చిన జడ శ్రవణ్, తక్షణమే సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్ పై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ వ్యాజ్యంపై ఈ రోజు హైకోర్టు విచారణ జరపనుంది.
  
వైఎస్‌ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్య, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో  ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. నూతన ఆర్టిస్ట్‌లతో రియలిస్టిక్‌గా ఉన్న పాత్రలతో రూపొందించిన ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు  వచ్చింది.  వివేకా బయోపిక్ ‘వివేకం’చూస్తే.. టార్గెట్ జగన్ అనే అని అర్థమవుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios