జూన్ 10న దాసరి సంస్మరణ సభ ఇమేజ్ గార్డెన్స్ లో నిర్వహించనున్న సినీ పరిశ్రమ గ్రూపులు లేవని, అంతా హాజరవుతారని తెలిపిన  పరుచూరి గోపాలకృష్ణ

మే 30న మరణించిన ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు సంతాపసభను ఈ నెల 10వ తారీఖున నిర్వహించనున్నట్టుగా సినీ దర్శక నిర్మాతలు తెలిపారు. దాసరి సమకాలీనులైన తెలుగు సినీ ప్రముఖుల చాలా మంది ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగానే సంతాప సభ ఆలస్యమయ్యిందని తెలిపారు. దాసరి మంచి ఫాంలో ఉన్న 80ల నాటి స్టార్స్ చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారు.

అందరూ అందుబాటులో ఉన్న సమయంలో సంతాప సభ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈనెల 10న సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా సి.కళ్యాణ్ తెలిపారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ సభకు ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ హాజరవుతారని తమ మధ్య ఎలాంటి గ్రూపుల్లేవని తెలిపారు.