BiggBoss7: బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబరాలు.. ఫస్ట్ టైం కన్నీరు మున్నీరైన తేజ, శోభా కూడా ఎమోషనల్
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో నేటి ఎపిసోడ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ కొనసాగుతూనే హౌస్ లో దసరా సంబరాలు ధూంధాం గా సాగుతున్నాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో నేటి ఎపిసోడ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ కొనసాగుతూనే హౌస్ లో దసరా సంబరాలు ధూంధాం గా సాగుతున్నాయి. సినీతారలు డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు.
దసరా సందర్భంగా నాగార్జున ఇంటి సభ్యులతో పలు వినోదాత్మక గేమ్స్ ఆడించారు. దూరంగా నిలబడి వారి పార్ట్నర్ మెడలో పూలదండలు వేయడం లాంటి ఫన్నీ గేమ్స్ ఆడించారు. ఈ గేమ్ లో అశ్విని, ప్రశాంత్ విజయం సాధించారు. అశ్విని.. ప్రశాంత్ మెడలో ఎక్కువ దండలు పడేలా విసిరింది. దీనితో ఆ జంట విజయం సాధించారు.
ఇక నామినేషన్స్ లో ఉన్న వారిని వారి కుటుంబ సభ్యుల చేతే సేవ్ చేయించే ప్లాన్ చేశారు. అశ్విని, తేజ, ప్రశాంత్, పూజ, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ముందుగా అశ్విని సేవ్ అయింది. ఆమె తల్లి వీడియో బైట్ ద్వారా తన కుమార్తెని సేవ్ చేసింది.
అనంతరం తేజ సేవ్ అయ్యాడు. తేజని అతడి తండ్రి సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ రోజు తేజ తండ్రి పుట్టిన రోజు కూడా. మా నాన్నే వచ్చి నన్ను సేవ్ చేశాడు అంటూ తేజ సంతోషంలో కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడు. పక్కన ఉన్న వారు అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక తేజ ఏడుపు చూసి శోభా శెట్టి కూడా ఎమోషనల్ అయింది. తేజని తానే నామినేట్ చేసానని కాబట్టి కాస్త టెన్షన్ పడ్డాను అని శోభా పేర్కొంది. ఇప్పుడు తేజ సేఫ్ కావడం సంతోషంగా ఉందని శోభా పేర్కొంది.