కన్నడ స్టార్ దర్శన్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాబర్ట్’. తెలుగులోనూ ఇదే పేరుతో రాబోతుంది. ఆశాభట్ నాయిక. వినోద్ ప్రభాకర్, జగపతిబాబు, రవి శంకర్ తదితర తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. తరుణ్ కిశోర్ సుధీర్ దర్శకుడు. మంగళవారం (ఫిబ్రవరి 16) దర్శన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. పవర్‌ఫుల్ డైలాగ్స్, విజువల్స్, నేపథ్య సంగీతంతో ఆద్యంతం ఆకట్టుకుంటుందీ ట్రైలర్.
టీజర్, ట్రైలర్ లతో క్రేజ్ క్రియేట్ చేసి ఓపినింగ్స్ రాబట్టుకోవటం ఇప్పుడున్న ట్రెండ్, అన్ని భాషలవాళ్లు అదే స్కీమ్ ని ఫాలో అవుతున్నారు. రిలీజ్ రోజు ఓపినింగ్స్ బాగుంటే టాక్ ఎలాగూ స్ప్రెడ్ అవుతుంది. పబ్లిసిటీ ఖర్చు కాస్త కంట్రోలులో ఉంటుంది. అందుకే నాలుగైదు వెర్షన్స్ ట్రైలర్ కట్ చేసుకుని,వాటిలో ఒకటి ఫైనల్ చేసుకుని ముందుకు వెళ్లటం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ ట్రైలర్స్ గురించి టాపిక్ ఏమిటీ అంటే...ఓ కన్నడ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఆ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా ఓపినింగ్స్ అదిరిపోతాయంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాబర్ట్’. తెలుగులోనూ ఇదే పేరుతో రాబోతుంది. ఆశాభట్ నాయిక. వినోద్ ప్రభాకర్, జగపతిబాబు, రవి శంకర్ తదితర తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. తరుణ్ కిశోర్ సుధీర్ దర్శకుడు. మంగళవారం (ఫిబ్రవరి 16) దర్శన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. పవర్‌ఫుల్ డైలాగ్స్, విజువల్స్, నేపథ్య సంగీతంతో ఆద్యంతం ఆకట్టుకుంటుందీ ట్రైలర్.

‘నన్నంతం చేయాలనుకునే వాడు నాకన్నా పెద్ద క్రిమినల్ బ్రెయిన్ అయి ఉండాలి. నాకన్నా టెర్రర్ అయి ఉండాలి.. నాకన్నా వైలంట్ అయి ఉండాలి’, ‘ఒకరి లైఫ్‌లో హీరో అవ్వాలనుకుంటే ఇంకొకరి లైఫ్‌లో విలన్ అవ్వాల్సిందే’, ‘శబరి ముందు తలొంచడం తెలుసు.. రావణుడి తల తుంచడమూ తెలుసు’ అనే సంభాషణలు అలరిస్తున్నాయి. ఉమాపతి శ్రీనివాస గౌడ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2021 మార్చి 11న విడుదల కానుంది.
