బెంగుళూరుకు దగ్గరలో గల దండుపాల్యం అనే ప్రాంతానికి చెందిన ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ కథ ఆధారంగా ఇప్పటి దాకా రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. దండుపాల్యం 3 చివరి భాగమని దండుపాల్యం గ్యాంగ్ కథ కంచికి చేరిందా లేదా అనేది ఇందులో చూపించి ముగించేశామని దర్శకుడు శ్రీనివాస రాజు గతంలోనే చెప్పాడు. ఈ మధ్యే శ్రీకాంత్ చేతుల మీదుగా దండుపల్యం 4 అని ఫస్ట్ లుక్ లాంచ్ చేసారు కాని దానికి తమతో సంబంధం లేదని హీరొయిన్ పూజ గాంధీ చెప్పడం ఇప్పటికే హాట్ టాపిక్ గా ఉంది. దానికి దర్శకుడు కూడా శ్రీనివాస రాజు కాదు. ఇక పోతే మొదటి రెండు భాగాలలో భయంకరమైన వయోలెన్స్ చూపించిన దర్శకుడు ఇందులో కూడా మోతాదు పెంచినట్టు పోస్టర్స్ ని బట్టే అర్థమవుతోంది. కాని అది ఎంత డోస్ లో ఉంటుంది అనేది మాత్రం ఊహకు అందటం లేదు .

దండుపాల్యం 3కి పోటీ బాగానే ఉంది. ముందుగా యూత్ ని టార్గెట్ చేస్తున్న నిఖిల్ కిరాక్ పార్టీ మీదే అందరి దృష్టి ఉంది. మ్యూజిక్ కూడా మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి. ఇక నయనతార తమిళ్ సూపర్ హిట్ అర్రం తెలుగులో కర్తవ్యంగా డబ్ చేసి అదే రోజు విడుదల చేస్తున్నారు. కోలీవుడ్ లో ప్రూవ్ అయిన హిట్ కాబట్టి నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దండుపాల్యం కేసు వేరు. మొదటి భాగం సూపర్ హిట్ అయ్యింది కాని దండుపాల్యం 2 మాత్రం ఆ రేంజ్ కథా కథనాలు లేక ఫస్ట్ పార్ట్ రేంజ్ కు చేరలేకపోయింది. అసలు కథంతా 3లో ఉంది కనక ఈసారి హిట్ కావడం ఖాయం అంటున్నారు నిర్మాతలు. వీటితో పాటు నెల్లూరు పెద్దారెడ్డి అనే చిన్న సినిమా కూడా అదే తేదికి పోటీ పడుతోంది. మొత్తానికి ట్రయాంగిల్ పోటీలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.