ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'విశ్వాసం'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శనివారం పుణెలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంధర్భంలో డాన్సర్ ఓ.ఎమ్.శర్వణన్(42) అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.

ఆయనకి వాంతులు కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ శర్వణన్ పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీరుకెళ్లారు. హీరో అజిత్ సుమారు మూడు గంటల పాటు ఆసుపత్రిలోనే గడిపారు.

శర్వణన్ మరణించారనే వార్త తెలియగానే.. అజిత్ తీవ్ర ఆందోళన చెందారు. మృతదేహాన్ని చెన్నైకి పంపడంలో అజిత్ తనవంతు సహాయం అందించారు. దాదాపు రూ.8 లక్షలు వెచ్చించినట్లు సమాచారం.