Asianet News TeluguAsianet News Telugu

దగ్గుబాటి అభిరామ్ ని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారా ?.. ఆ కొత్త వ్యాపారం ఏంటి, అసలేం జరిగింది..

హీరోగా ఎంట్రీ కాకముందే అనేక వివాదాల్లో దగ్గుబాటి అభిరామ్ నిలిచాడు. ఇప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.

Daggubati Abhiram interesting comments in his new business dtr
Author
First Published Oct 15, 2023, 5:07 PM IST | Last Updated Oct 15, 2023, 5:07 PM IST

హీరోగా ఎంట్రీ కాకముందే అనేక వివాదాల్లో దగ్గుబాటి అభిరామ్ నిలిచాడు. ఇప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు అభిరామ్ సోదరుడు రానా దగ్గుబాటి విలక్షణ నటుడిగా ఇండియా మొత్తం గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. 

దగ్గుబాటి అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. దీనితో అభిరామ్ తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. అభిరామ్ నెక్స్ట్ మూవీ ఏంటనేది ఇంకా ఖరారు కాలేదు. 

అయితే దగ్గుబాటి అభిరామ్ కొత్త వ్యాపారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనితో అభిరామ్ సినిమాలు పక్కన పెట్టి వ్యాపార రంగంలో స్థిరపడనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రైటర్స్ కేఫ్ పేరిట అభిరామ్ ఓ కేఫ్ ప్రారంభించారట. సొంతంగా వ్యాపారం ప్రారంభించడంపై అభిరామ్ మీడియాతో స్పందించాడు. 

తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనే ఉద్దేశంతోనే కేఫ్ ప్రారంభించినట్లు అభిరామ్ పేర్కొన్నాడు. తాను కేఫ్ ప్రారంభించడం వల్ల కోపంతో కుటుంబ సభ్యులు తనని ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు అని అభిరామ్ పేర్కొన్నాడు. 

జీవితంలో తనకి నాన్న, బాబోయ్, అన్నయ్య అనేక విలువైన సలహాలు ఇస్తుంటారు అని అభిరామ్ పేర్కొన్నాడు. ఇక నటుడిగా తాను చాలా నేర్చుకోవాలి అని అభిరామ్ తెలిపాడు. తన తదుపరి చిత్రానికి అవకాశాలు వస్తున్నాయి. కానీ తానే గ్యాప్ తీసుకున్నాను అని అభిరామ్ పేర్కొన్నాడు. త్వరలో అభిరామ్ వివాహం జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన వివాహం విషయం కుటుంబ సభ్యులే నిర్ణయిస్తారు అని అభిరామ్ తెలిపాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios