Asianet News TeluguAsianet News Telugu

వెంకీని వ‌ద‌ల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీస్.. ఏం చేశారో చూడండి


సినిమా యాక్టర్స్ మెసేజ్ చెప్తే వచ్చే మైలేజ్ వేరు. ఆ విషయం చాలా కాలం నుంచి ప్రూవ్ అవుతున్నదే. ప్రపంచం నమ్ముతున్నదే. అందుకే పోలియో చుక్కలు కానీ ట్రాఫిక్ రూల్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్ గురించి కానీ ఇలా ఏది చెప్పాలన్నా ప్రభుత్వం సినిమావాళ్ల వైపు చూస్తుంది. అంతెందుకు రీసెంట్ గా అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో బిట్స్ కట్ చేసి కేరళ పోలీస్ లు పబ్లిసిటీ చేసుకున్నారు.

Cyber crime messege with Venkatesh jsp
Author
Hyderabad, First Published Mar 8, 2021, 8:09 PM IST

సినిమా యాక్టర్స్ మెసేజ్ చెప్తే వచ్చే మైలేజ్ వేరు. ఆ విషయం చాలా కాలం నుంచి ప్రూవ్ అవుతున్నదే. ప్రపంచం నమ్ముతున్నదే. అందుకే పోలియో చుక్కలు కానీ ట్రాఫిక్ రూల్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్ గురించి కానీ ఇలా ఏది చెప్పాలన్నా ప్రభుత్వం సినిమావాళ్ల వైపు చూస్తుంది. అంతెందుకు రీసెంట్ గా అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో బిట్స్ కట్ చేసి కేరళ పోలీస్ లు పబ్లిసిటీ చేసుకున్నారు. అలాంటి ఆలోచనే మన సైబర్ క్రైమ్ వాళ్లకు వచ్చినట్లుంది. సైబర్ క్రైమ్ ని అరికట్టే విషయాలను చెప్పేందుకు మన విక్టరీ వెంకటేష్ పాత సినిమా విజువల్స్ వాడుకున్నారు. చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియో మంచి మేసేజ్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

ఆన్‌లైన్‌లో మోసాలు అరికట్టడానికి, గిఫ్ట్ వ‌చ్చింద‌ని, మీ పేరు మీద ల‌క్కీ డ్రా వ‌చ్చింద‌ని.. ఇలా క‌స్ట‌మ‌ర్‌కేర్ల పేరిట యూజ‌ర్ల‌కు కొంత‌మంది మోస‌గాళ్లు ఫోన్ చేయ‌డం.. అకౌంట్ల నుంచి డ‌బ్బుల‌ను కొట్టేయ‌డం చేస్తున్నారనే విషయంపై ఎవర్నెస్ కు ఈ వీడియోని తయారు చేసారు.   ఈ క్ర‌మంలో ఆ మ‌ధ్య‌  బ్ర‌హ్మానందంను రంగంలోకి దింపిన‌ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు.. ఆయ‌న చేత అవ‌గాహ‌న క‌లిగించారు. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్‌ని కూడా రంగంలోకి దింపారు. ఆయ‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఓ వీడియోను చేసి విడుద‌ల చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. మీరూ ఇప్పుడా వీడియో పై ఓ లుక్కేయండి
 

Follow Us:
Download App:
  • android
  • ios