అక్షయ్ కుమార్‌తో రకుల్ ప్రీతి సింగ్ కలిసి నటించిన ‘కట్‌పుత్లీ’ సినిమా ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ సినిమా హిందీ రీమేక్ ఇది. ఈ చిత్ర కథా నేపథ్యం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాగా..ఇందులో రొమాంటిక్ అంశాలనూ చేర్చారు.
ఈ మధ్యన అక్షయ్ కుమార్ సినిమాలు పరిస్దితి అసలు బాగోలేదు. వరస పెట్టి డిజాస్టర్స్ అవుతున్నాయి. తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసే ఉద్దేశంతో ఏది పడితే అది ఓకే చేసిసి ముందుకు వెళ్తున్న అక్షయ్ కుమార్ కు ఇటీవలే బచ్చన్ పాండే గట్టి షాక్ ఇచ్చింది. రొట్ట మాస్ కథల్లో తనను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదని అర్థమైపోయింది. ఆ సినిమా మినిమం డెబ్భై కోట్లు కూడా రాబట్టలేక చతికిలబడింది. అందుకే ప్రాక్టికల్ గా అలోచించి ఇప్పుడీ ‘కట్‌పుత్లీ’ను హాట్ స్టార్ కు ఇచ్చేశారు. ఆ సినిమా ఇంకా దారుణం అయ్యిపోయింది. వివరాల్లోకి వెళితే...
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళ చిత్రం ‘రాక్షసన్’ కిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్‌కు రామ్ కుమార్ దర్శకుడు కాగా.. తెలుగులో దీన్ని రమేశ్ వర్మ తెరకెక్కించాడు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కాస్తంత ఆలస్యంగా రీమేక్ చేసి రిలీజ్ చేసారు. ఆ సినిమా పేరు ‘కట్‌పుత్లీ’. అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. అనుపమా పరమేశ్వరన్ స్థానాన్ని రకుల్ ప్రీత్ సింగ్ భర్తీ చేయగా.. కేస్టింగ్ మొత్తం అక్కడి ఆడియన్స్‌కు తగ్గట్టుగా మార్చేశారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలైంది ఈ సినిమా. అయితే హాట్ స్టార్ లో అతి తక్కువ మంది చూసిన హిందీ సినిమాగా పేరు తెచ్చుకుంది.ఇది అక్షయ్ కుమార్ కు ఘోరమైన అవమానమే అని అంటున్నారు. డిస్నీ హాట్ స్టార్ నుంచి అక్షరాలా 135 కోట్ల రూపాయలు హక్కుల రూపంలో నిర్మాతకు ముట్టినట్టు బాలీవుడ్ న్యూస్. ఇది చాలా పెద్ద మొత్తం.
కథ బ్యాక్ డ్రాప్.. హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలి పట్నానికి షిఫ్ట్ చేసారు. టీనేజ్ అమ్మాయిలు వరుసగా మర్డర్ అవుతుండడంతో.. డిపార్ట్‌మెంట్ లోని ఇంటెలిజెంట్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. అదే మెయిన్ పాయింట్‌ను తీసుకున్నా.. సైకో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ ను పూర్తిగా తగ్గించేసి.. క్లైమాక్స్ లో స్పీడ్ పెంచారు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే రన్‌టైమ్‌ను కూడా బాగా తగ్గించేశారు. టెంప్లెట్‌ను కొంత మేర ఫాలో అయినప్పటికీ.. రాక్షసుడులోని ఫీల్ ను క్యారీ చేయడంలో ‘కట్‌పుత్లీ’ పూర్తిగా తడబడింది.
ఈ చిత్ర కథా నేపథ్యం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాగా..ఇందులో రొమాంటిక్ అంశాలనూ చేర్చారు. దీనిపై కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం మొదలు పెట్టారు. మాతృకలో ఉన్న కథాంశానికి బాగా రొమాన్స్ చేర్చారన్న విమర్శలు ప్రధానంగా వచ్చాయి. దర్శకుడు రంజిత్ యం. తివారీ (Ranjith M Thiwari) దర్శకత్వ ప్రతిభ కొన్ని సన్నివేశాలకే పరిమితమయింది. ఇక తమిళ, తెలుగు వెర్షన్స్‌కు ప్రాణం పోసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయింది హిందీ వెర్షన్. లేడీ పోలీసాఫీసర్ పాత్రను కూడా మార్చేయడంతో హిందీ వెర్షన్ పూర్తి స్దాయిలో తేడా కొట్టింది. ‘కట్‌పుత్లీ’ రాక్షసుడు చిత్రం స్థాయిని ఏ మాత్రం అందులేకపోయింది. యంగ్ హీరో చేయాల్సిన పాత్రను అక్షయ్ కుమార్ చేయడం కూడా దీనికి మైనస్ అని చెబుతున్నారు.
