టాలీవుడ్ స్టార్ల ప్రేమకథలు!

First Published 16, Feb 2019, 11:39 AM

టాలీవుడ్ స్టార్ల ప్రేమకథలు!

సెలబ్రిటీల ప్రేమకథలపై జనాలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని రూమర్ల నుండి పుట్టి నిజమైన ప్రేమకథలు కూడా ఉన్నాయి. మన టాలీవుడ్ లో కొన్ని ఆ కోవకు చెందినవే..

'ఏ మాయ చేసావే' సినిమా సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ ఆ విషయాన్ని బయటకి రానివ్వలేదు. కొన్నాళ్ల తరువాత ఇద్దరూ కలిసి బయట కనిపించడం, పార్టీలకు అటెండ్ అవుతుండడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది.

స్నేహారెడ్డిని ఓ పెళ్లిలో కలుసుకున్నాడు అల్లు అర్జున్. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని పరిచయం పెంచుకొని అది కాస్త పెళ్లి వరకు తీసుకొచ్చాడు.

వీరిద్దరూ కాలేజ్ నుండి స్నేహితులు. ఆరెంజ్ సినిమా సమయంలో ఉపాసనతో డేటింగ్ మొదలుపెట్టిన చరణ్ పెద్దలను ఒప్పించి ఆమెని పెళ్లి చేసుకున్నాడు.

నాని వైజాగ్ లో వీజే గా పని చేస్తోన్న సమయంలో అంజనాతో పరిచయం ఏర్పడింది. దాదాపు ఐదేళ్ల పాటు సాగిన వారి స్నేహం ప్రేమకి దారి తీసింది. ఆ తరువాత 2012లో పెద్దల సహకారంతో ఆమెని వివాహం చేసుకున్నాడు.

'వంశీ' సినిమా షూటింగ్ లో నమ్రతతో ప్రేమలో పడ్డాడు మహేష్. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమఉన్నా వ్యక్తపరుచుకునే అవకాశం రాలేదు. కొన్నాళ్లకు వీరిపై రూమర్లు షికారు చేశాయి. ఈ వార్తలు వారికి మంచే చేశాయి. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని బయటపెట్టాయి. ఆ తరువాత పెద్దలను ఒప్పించి సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు.

తన బంధువుతో పాటు ఓసారి తమ ఇంటికి వచ్చిన ప్రణతిని చూసిన మంచు మనోజ్ ఆమెతో ప్రేమ పడ్డాడు. ఇదే విషయాన్ని ఆమెకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

'శివ' సినిమా సమయంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. 1992 లో అమలని వివాహం చేసుకున్నాడు నాగార్జున. అతడికి ఇది రెండో పెళ్లి.

రమాకి అప్పటికే పెళ్లై విడాకులు తీసుకుంది. తొమ్మిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయినా ప్రేమకి అవేవీ అడ్డం కాదని.. ఆమెని ప్రేమించాడు రాజమౌళి. పెద్దలు అంగీకరించడంతో ఆమెని పెళ్లాడాడు.

వైఎస్సార్ కుటుంబానికి చెందిన వేరోనికా రెడ్డిని ప్రేమించిన మంచి విష్ణు పెద్దలను ఒప్పించి ఆమెని వివాహం చేసుకున్నాడు.

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కెరీర్ ఆరంభంలోనే రాజీవ్ ని ప్రేమించింది. వీరి పెళ్లికి మొదట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా.. ఈ జంట మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆ తరువాత కొంత కాలానికి ఈ జంట పెళ్లి చేసుకొంది.