నరేష్ ప్రవర్తనపై మండిపాటు.. కృష్ణ చనిపోయిన బాధలో అంతా ఉంటే.. ఇలా చేశాడంటూ విమర్శలు.!
సీనియర్ నటుడు నరేశ్ (Naresh)పై నెట్టింట విమర్శలు గుప్పుమంటున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన సమయంలో ఆయన ప్రవర్తన అస్సలు బాగోలేదంటూ నెటిజన్లు, అభిమానులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయా అంశాలను ఎత్తిచూపుతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తిరిగి రానిలోకాలకు వెళ్లారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, అభిమానులూ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు నరేష్ (Naresh)పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో ఆయన పార్థివ దేహాన్ని నరేశ్ ఇంటికే తరలించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, సెలబ్రెటీలు, రాజకీయ వేత్తలు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించేందుకు అక్కడికి చేరుకున్నారు.
దివంగత కృష్ణను ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన వారికి నరేశ్ చిరాకు తెప్పించే పనులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కృష్ణ చనిపోయిన సమయంలో నరేశ్ అక్కడికి వచ్చిన వచ్చిన సెలబ్రెటీలతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెతున్నాయి. ఓ దర్శకుడు, నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.అంతా కృష్ణ చనిపోయిన బాధలో ఉంటే.. నరేశ్ మాత్రం అదేదో ఫంక్షన్ లాగా వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎదురెళ్లి స్వాగతించడం నచ్చలేదంటున్నారు. హుందాగా వ్యవహరించకపోవడంతో పాటు విషాద సమయంలో హడావుడిగా నడుచుకోవడం పట్ల అందరూ మండిపడుతున్నారు. ఆయన ప్రవర్తనపై కుటుంబీకులకూ నచ్చలేదని తెలుస్తోంది.
మరోవైపు నటి పవిత్రని కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కలిపి కూర్చోబెట్టడం కూడా ఎవ్వరికీ నచ్చలేదని అంటున్నారు.అదీగాక విషాద ఘటనతో బాధపడుతున్న కొందరికీ ఆమెను పరిచయం చేయడం మరింత ఎబ్బెట్టుగా అనిపించిందంటూ పలువురు మండిపడుతున్నారు. ఇక మొన్నటి నుంచి నరేశ్ అమర్యాదగా సీఎం కేసీఆర్ (CM KCR) వైపు చేయి చూపించడంతో వెంటనే బుద్ధి చెప్పిన ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దివంగత నటి విజయ నిర్మల చనిపోయినప్పుడు కూడా నరేశ్ చేష్ఠలు సినీ పెద్దలకు కోపం తెప్పించాయని, ఇప్పుడూ మళ్లీ అదే ప్రవర్తన కలిగి ఉండటం పట్ల ఇండస్ట్రీలోని ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాస్తా హుందాగా ఉంటే బాగుండని అభిప్రాయపడుతున్నారు.