Asianet News TeluguAsianet News Telugu

మహేష్‌బాబు సినిమా స్టోరీ కాపీ.. కొరటాల శివపై క్రిమినల్‌ కేసు..

మహేష్‌బాబు తో చేసిన సినిమాకి సంబంధించి దర్శకుడు కొరటాల శివ వివాదంలో ఇరుక్కున్నాడు.  అనూహ్యంగా ఆయన క్రిమినల్‌ కేసు ఎదుర్కోవల్సి వచ్చింది.

criminal case on director koratala siva regards movie with  maheshbabu arj
Author
First Published Dec 10, 2023, 6:14 PM IST

దర్శకుడు కొరటాల శివ వివాదంలో ఇరుక్కున్నాడు. ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదైంది. అంతేకాదు కోర్ట్ సైతం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందే అంటూ జడ్జ్ మెంట్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఉన్నట్టుండి దర్శకుడు కొరటాలపై క్రిమినల్‌ కేసు ఏంటనేది ఆశ్చర్యంగా మారింది. ఆ వివరాలు చూస్తే.. మహేష్‌బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను` చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. 

ఇందులో `శ్రీమంతుడు` సినిమా స్టోరీ కాపీ అంటూ సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అయితే `శ్రీమంతుడు` సినిమా రిలీజ్‌ టైమ్‌లో శరత్‌ చంద్ర అనే రైటర్‌ దర్శకుడు కొరటాల శివపై కేసు నమోదు చేశాడు. దాని తీర్పు ఇప్పుడు రావడం గమనార్హం. `శ్రీమంతుడు` సినిమా 2015లో సినిమా విడుదలైంది. ఆ సమయంలో `శ్రీమంతుడు` సినిమా వేమూరి బలరాం నేతృత్వంలో నడిచే `స్వాతి మాస పత్రిక`లో ప్రచురితమైన `చచ్చేంత ప్రేమ` నవల ఆధారంగా ఈ సినిమా తీశారని ఆరోపిస్తూ రైటర్‌ శరత్‌ చంద్ర ఆ సమయంలోనే దర్శకుడు కొరటాల శివ, ఎంబీ క్రియేషన్‌ అధినేత మహేష్‌బాబు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్‌ ఎర్నేనిలపై కేసు వేశారు. 

1729/2017 సెక్షన్‌ క్రింద కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసు కొట్టేయాలని కోరుతూ మహేష్ బాబు, నవీన్, కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించగా.. దర్శకుడు కొరటాల శివ కాపీరైట్ చట్టం కింద క్రిమినల్‌ కేసును ఎదురుకోవాల్సిందే అని హైకోర్టు తాజాగా తమ తీర్పుని వెల్లడించింది. ఈ మేరకు జడ్జిమెంట్ కాపీలను విడుదల చేసింది. దీంతో క్రిమినల్ కేసును దర్శకుడు కొరటాల శివ ఎదుర్కోవడం అని వార్యం అయింది.  శరత్ చంద్ర తరుపున కేసుని ప్రముఖ న్యాయవాది చల్లా అజయ్, రాజశేఖర్  వాదించడం విశేషం. 

మహేష్‌బాబు, శృతి హాసన్‌ జంటగా నటించిన `శ్రీమంతుడు` సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2015 ఆగస్ట్ 7న ఈ చిత్రం విడుదలైంది. పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. పరాజయాల్లో ఉన్న మహేష్‌కి బిగ్‌ రిలీఫ్‌నిచ్చింది. ఇందులో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ.. ఎన్టీఆర్‌ హీరోగా `దేవర` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుంది. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల కాబోతుంది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios