గత ఏడాది నా పేరు సూర్య చిత్రంతో బన్నీ అభిమానులని నిరాశపరిచాడు. దీనితో అలా వైకుంఠపురములో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇది క్రేజీ కాంబోలో వస్తున్న మూవీ. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తునడం విశేషం. తాజాగా అలా వైకుంఠపురములో చిత్ర యూనిట్ అభిమానులని ఖుషి చేసే అప్డేట్ అందించింది. అలా వైకుంఠపురములో చిత్రం నుంచి త్వరలో 'సామజవరగమన' అంటూ సాంగ్ బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ పాటతో అలా వైకుంఠపురములో ప్రచార కార్యక్రమాలు షురూ అవుతాయి. 

ఆ పాటలోని ఓ వినసొంపైన లైన్ ని ప్రోమో రూపంలో విడుదల చేశారు. 'నీకాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు' అంటూ హాయిగా సాగే సంగీతంతో ఈ పాట ఉండనుంది. ఈ పాటని శ్రీరామ్ పాడగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించాలరు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండడం విశేషం. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేతకు తమనే సంగీతం అందించాడు. 

తమన్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రేసుగుర్రం, సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.