రతికా రోజ్ కి బంపర్ ఆఫర్... ఏకంగా ఆయన దర్శకత్వంలో!
బిగ్ బాస్ తెలుగు 7 సెవెన్ తో వెలుగులోకి వచ్చిన రతికా రోజ్ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు సమాచారం. ఆమెకు బంపర్ ఆఫర్ తగిలిందట.
ఈ సీజన్లో ప్రేక్షకులను ఆకర్షించిన కంటెస్టెంట్స్ లో రతికా రోజ్ ఒకరు. ఈ భామ మొదటి రోజు నుండే గేమ్ మొదలుపెట్టింది. అయితే బోర్లా పడింది. ఆమె స్ట్రాటజీస్ కొన్ని దెబ్బ తిన్నాయి. రైతు బిడ్డతో సన్నిహితంగా ఉండటం, ఆ వెంటనే అతన్ని తిట్టడం ఆమె పట్ల నెగిటివిటీకి కారణమయ్యాయి. దీంతో నాలుగో వారం ఆమె హౌస్ వీడింది. రతికా రోజ్ ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఆమె గేమ్ కారణంగా ఇంటి నుండి బయటకు రావాల్సి వచ్చింది.
ప్రేక్షకుల్లో నెగిటివిటీ మూటగట్టుకున్నప్పటికీ రతికా రోజ్ కి బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తుంది. ఆమెకు గొప్ప సినిమా ఆఫర్ వచ్చిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఆమె ఓ మూవీ చేస్తుందట. ఈ చిత్రంలో ఆమె లీడింగ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరి రాఘవేంద్రరావు మూవీ అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. ఆమెకు ఇంత పెద్ద ఆఫర్ రావడం విశేషం.
కాగా ఆమెకు బిగ్ బాస్ షోలో సెకండ్ ఛాన్స్ కోసం ప్రయత్నం చేస్తుంది. గతం మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన దామిని, రతికా రోజ్, శుభశ్రీలను నాగార్జున హౌస్లోకి పిలిచాడు. వీరిలో ఒకరు మరల హౌస్లోకి వస్తాడని చెప్పాడు. అయితే అది నిర్ణయించేది ఇంటి సభ్యులే అని చెప్పాడు. ఎవరికి మెజారిటీ ఓట్లు వస్తాయో వాళ్ళు ఇంట్లోకి తిరిగి వస్తారు అన్నారు. రతికా రోజ్ తిరిగి బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్స్ లేదంటున్నారు. ఆమెకు ఈ షో వలన విపరీతమైన నెగిటివిటీ వచ్చిన నేపథ్యంలో వద్దు అంటుకుంటున్నారట.