నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. క్రికెటర్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ కథతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కట్టిపడేశాడు. నాని తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల హృదయాలు బరువెక్కేలా చేశాడు. నటుడిగా నానికి ఈ చిత్రం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. జెర్సీ చిత్రం త్వరలో తమిళంలో రీమేక్ కాబోతోంది. 

యంగ్ హీరో విష్ణు విశాల్ జెర్సీ తమిళ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు. విష్ణు విశాల్ కు జోడి ఎవరనేది ఆసక్తిగా మారింది. జెర్సీ చిత్రంలో హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్ అద్భుతంగా నటించింది. తమిళ రీమేక్ లో శ్రద్దా శ్రీనాధ్ పాత్రలో నటించే అవకాశం సెన్సేషనల్ హీరోయిన్ అమలాపాల్ కు దక్కినట్లు సమాచారం. 

అమలాపాల్ ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన 'ఆమె' చిత్రంలో నగ్నంగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కథ నచ్చితే ఎలాంటి సాహసానికైనా సిద్దమే అని ఇదివరకే అమలాపాల్ ప్రకటించింది. తమిళ జెర్సీ రీమేక్ కు నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించబోతున్నాడు. 

నటిగా అద్భుతంగా హావభావాలు పలికించే అమలాపాల్ అయితే ఈ చిత్రానికి బావుంటుందని నెల్సన్ భావిస్తున్నాడట. త్వరలో జెర్సీ రీమేక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.