నిన్న ఆర్ ఆర్ ఆర్ నుండి భారీ అప్డేట్ వచ్చింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై రాజమౌళి స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 23న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల కానుంది. దాదాపు నాలుగు నెలలుగా ఈ ప్రకటన కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మార్చి నెలలో చరణ్ బర్త్ డే కానుకగా అల్లూరిగా చరణ్ ని విభిన్నంగా మరియు అధ్బుతంగా పరిచయం చేశారు. దానితో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై అంచనాలు పీక్స్ కి చేరాయి. 

మే 20వ తేదీని ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ వీడియో విడుదల కావాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ వలన షూటింగ్ కి బ్రేక్ పడడంతో అది కుదరలేదు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోకి కావలసిన మెటీరియల్ లేదన్న రాజమౌళి, హడావుడిగా ఫస్ట్ లుక్ విడుదల చేయలేమని చెప్పి వాయిదా వేశారు. ఐతే షూటింగ్ మొదలైన వెంటనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై అప్డేట్ ఉంటుందని వివరణ ఇచ్చారు. 

చెప్పినట్లుగానే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన వెంటనే రాజమౌళి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ ని అల్లూరిగా అద్భుతంగా చూపించాడు. కండల శరీరాన్ని చూపిస్తూ, విలుకాడిగా, షూటర్ గా యుద్ధ విద్యల్లో నైపుణ్యం ఉన్న వీరుడిగా చరణ్ ని పరిచయం చేయడం జరిగింది. 

మరి ఎన్టీఆర్ రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తారు. టీజర్ లో ఏఏ అంశాలు హైలెట్ కానున్నాయనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో కూడా కొమరం భీమ్ గా ఎన్టీఆర్ వీరత్వం, సాహసాలు హైలెట్ కానున్నాయట. వీటితో పాటు ఎన్టీఆర్ పై పులితో ఫైట్ సన్నివేశం చిత్రీకరించారు. కాబట్టి ఈ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన విజువల్స్ టీజర్ చూపించనున్నారు అనేది టాలీవుడ్ టాక్. ఎప్పుడూ ప్రేక్షకుల ఊహకు మించిన అనుభూతిని పంచె రాజమౌళి ఈ సారి కూడా తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడని మాత్రం చెప్పవచ్చు.