హీరో మంచు మనోజ్ తండ్రి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఊపందుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.  

మంచు మనోజ్ 2023 మార్చి 3న భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో భూమా మౌనిక గర్భం దాల్చారన్న వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. భూమ మౌనికకు మొదటి భర్తతో ఒక అబ్బాయి ఉన్నాడు. కొడుకు పేరు ధైరవ్ రెడ్డి. పెళ్ళయాక మనోజ్ వద్దే అతడు పెరుగుతున్నాడు. మనోజ్ కి ధైరవ్ అంటే చాలా ఇష్టం. శివుడు ఇచ్చిన కొడుకుగా ఇప్పటికే ప్రకటించాడు. అతన్ని దత్తత తీసుకున్నట్లే మనోజ్ మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ మౌనికతో మరో బిడ్డను ప్లాన్ చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

మనోజ్ కి మొదటి భార్యతో సంతానం లేరు. 2019లో ఆమెతో విడిపోయాడు. కాగా రెండో భార్య మౌనిక గర్భం దాల్చారని ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. మనోజ్, మౌనిక ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. విడాకులయ్యాక ఒంటరిగా ఉంటున్న వీరి మధ్య అనుబంధం చిగురించింది. అది ప్రేమకు దారి తీసింది. మంచు మోహన్ బాబుకి భూమా ఫ్యామిలీతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలోనే మౌనిక, మనోజ్ లకు పరిచయం ఉంది. మౌనిక వివాహానికి మనోజ్ హాజరు కావడం విశేషం. మౌనికతో మనోజ్ వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. మోహన్ బాబు, విష్ణు వేడుకలకు దూరంగా ఉన్నారు. మంచు లక్ష్మి ముందుండి మనోజ్ వివాహం చేసింది. ఈ క్రమంలో పుకార్లు నిజమే అన్న వాదన వినిపించింది. మనోజ్ పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరయ్యారు.

ఇక మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అవుతున్నారు. వాట్ ది ఫిష్ టైటిల్ తో మనోజ్ ఒక మూవీ ప్రకటించారు. అలాగే ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయన్నారు. మనోజ్ సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా కాలం అవుతుంది. అలాగే విష్ణుతో మనోజ్ కి విబేధాలు కొనసాగుతున్నాయి. మంచు బ్రదర్స్ కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయిలో జరిగినట్లు సమాచారం.