స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. అల వైకుంఠపురంలో మూవీ విడుదల తరువాత ఆయన కాన్ఫిడెంట్ మరింతగా పెరిగిపోయింది. ఆ మూవీ సాంగ్స్ కి బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా స్టెప్స్ వేయగా, అల వైకుంఠపురంలో అద్భుతం అంటూ పొగిడినవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ గా డీగ్లామర్ రోల్ చేస్తున్నాడు. 

పుష్ప అల్లు అర్జున్ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. నిజానికి మూవీ ప్రకటన సమయంలో దీన్ని పాన్ ఇండియాగా తెరకెక్కించే ఆలోచన బన్నీకి లేదు. ప్రభాస్ తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే మరికొందరు హీరోలు కూడా పాన్ ఇండియా చిత్రాలకు సిద్ధం అవుతున్నారు. దీనితో పుష్ప పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని భావించారు. 

కాగా పుష్ప మూవీ తరువాత బన్నీ దర్శకుడు కొరటాల శివ మూవీలో నటించాల్సి ఉంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుందట. ఎప్పటిలాగే సోషల్ కాన్సెప్ట్ తో కూడిన ఓ సబ్జెక్టు బన్నీ కోసం సిద్ధం చేశాడట రాజమౌళి. కాగా ఈ చిత్రానికి కొరటాల శివ పూర్తిగా పొలిటికల్ టచ్ ఇవ్వనున్నాడట.  సమకాలీన రాజకీయ అంశాలు ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.