'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా విమర్శలు, ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను కూడా రాబట్టింది.

ఇప్పటికే మూడు వందల కోట్ల దిశగా ఈ సినిమా పరుగులు తీస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో సందీప్ బాగా పాపులర్ అయ్యాడు. చాలా మంది నిర్మాతలు అతడి కోసం క్యూలు కడుతున్నారు. ఒకరిద్దరు నిర్మాతలు వంద కోట్ల రేంజ్ లో ప్యాకేజ్ లు ఆఫర్ చేస్తున్నారట.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా సందీప్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. సందీప్ కూడా తన తదుపరి సినిమా బాలీవుడ్ లోనే చేయాలని  భావిస్తున్నాడట. అది కూడా హిట్టయితే ఇక ఈ తెలుగు డైరెక్టర్ ని బాలీవుడ్ వాళ్లు వదులుకునే ఛాన్స్ ఉండదు. సందీప్ కూడా అక్కడే సెటిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అదంతా బాగానే ఉంది కానీ తెలుగులో మైత్రి మూవీస్, ఏషియన్ సునీల్ వంటి నిర్మాతలు సందీప్ బాలీవుడ్ సినిమా పూర్తి చేసి తెలుగులోకి వస్తాడని చూస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తనకున్న ఆఫర్లను చూస్తుంటే సందీప్ టాలీవుడ్ కి వచ్చి హీరోలకు కథలు చెప్పడానికి ప్రయత్నించేలా కనిపించడం లేదు. మరేం జరుగుతుందో చూడాలి!