Asianet News TeluguAsianet News Telugu

#Animal:‘యానిమల్’ వివాదంలో నెట్ ఫ్లిక్స్, నిర్మాతకు హైకోర్టు సమన్లు

జస్టిస్ సంజీవ్ నరులా కేసును స్వీకరించారు. నెట్‌ఫ్లిక్స్, టి-సిరీస్‌లకు సమన్లు పంపారు. లిఖిత పూర్వకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టు సమయం ఇచ్చింది. 

Court summons Netflix co producer of film Animal on plea to restrain OTT release jsp
Author
First Published Jan 20, 2024, 8:38 AM IST


‘యానిమల్’ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ జనవరి 26న స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమౌతోంది. ఇదే  సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్ నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన సినీ వన్ స్డూడియోస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.  OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ , చిత్ర సహ నిర్మాతకు సమన్లు ​​జారీ చేసింది.  జస్టిస్ సంజీవ్ నరులా కేసును స్వీకరించారు. నెట్‌ఫ్లిక్స్, టి-సిరీస్‌లకు సమన్లు పంపారు. లిఖిత పూర్వకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టు సమయం ఇచ్చింది. ఇది మాత్రమే కాదు, వ్రాతపూర్వక ప్రకటనతో పాటు వాది పత్రాలను అంగీకరించడం/తిరస్కరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ప్రతివాదులను ఆదేశించింది.

 వివాద వివరాల్లోకి వెళితే..

 ‘యానిమల్’విషయమై  కోర్టుకు ఎక్కటానికి కారణం ...నిర్మాత  మ్యూజిక్ కంపెనీ టి సిరీస్ తమతో కుదుర్చుకున్న ఎగ్రిమెంట్ ఉల్లంఘనకు గురైందని, యానిమల్ సినిమాలో 35 శాతం ప్రోఫిట్ షేర్,  intellectual property rights ఉన్నాయని సినీ వన్ స్డూడియోస్ పిటీషన్ దాఖలు చేసింది. ప్రోఫిట్ షేరింగ్ విషయంలో టి సిరీస్ ఒప్పందాన్ని గౌరవించలేదని ఆరోపించింది. సూపర్ క్యాసెట్స్ వారు ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బు మొత్తం కలెక్ట్ చేసి తీసేసుకున్నారు కానీ తమకు సింగిల్ పైసా కాడూ ఇవ్వలేదని అన్నారు. తమకు ఆ సంస్దతో చాలా కాలం నుంచి రిలేషన్ షిప్ ఉన్నా ఎగ్రిమెంట్ కు రెస్పెక్ట్ ఇవ్వలేదని ఆరోపించారు. రిలేషన్ ని గౌరవించే ఇంతకాలం తాము ఎగ్రిమెంట్ ని ఉల్లంఘించినా వెయిట్ చేసి కోర్టుకు రాలేదని చెప్పుకొచ్చారు.  అదే సమయంలో యానిమల్ సినిమాకు సీక్వెల్‌గా యానిమల్ పార్క్ ప్రకటించడంపై కూడా సినీ వన్ స్టూడియోస్ అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టు విషయంలో తమతో సంప్రదింపులు జరపాల్సి ఉందని స్పష్టం చేసింది. 

అయితే యానిమల్  సినిమా హక్కుల్ని సినీ వన్ స్టూడియోస్ సంస్థ 2.2 కోట్లకు వదులుకుందని చెబుతూ అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాల్ని టి సిరీస్ తరపు న్యాయవాది అమిత్ సిబల్ కోర్టుకు సమర్పించారు. సినీ వన్ స్టూడియోస్ ఈ విషయాన్ని దాచిపెట్టిందని వాదించారు. ఈ ఒప్పందంపై వివరణ ఇవ్వాలని కోర్టు సినీ వన్ స్టూడియోస్ సంస్థను ఆదేశిస్తూ కేసు విచారణ జనవరి 18కు వాయిదా వేసింది. ఈ క్రమంలో యనిమల్ సినిమా నిర్ణీత తేదీ జనవరి 26కు స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది డౌట్ గా మారింది. 

మరో ప్రక్క  థియేటర్లలో కట్ అయిన కొన్ని సీన్స్‌ను ఓటీటీలో యాడ్ అవుతాయని తెగ  ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో రణబీర్ కపూర్, విలన్ బాబీ డియోల్ మధ్య ఇంటెన్స్ ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్.. చాలామంది యాక్షన్ మూవీ లవర్స్‌ను కట్టిపడేసింది. అయితే ఆ సీన్ మధ్యలో బాబీ డియోల్.. రణబీర్ కపూర్‌ను ముద్దుపెట్టుకున్నానని, కానీ అది థియేటర్లలో విడుదల చేయలేదని, ఓటీటీ వర్షన్‌లో ఆ సీన్స్ ఉండే అవకాసం ఉందని సందీప్ బయిటపెట్టాడు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటికు రిలీజ్ డేట్ ఫిక్సైందనే వార్త ఫ్యాన్స్ ఆనందాన్ని కలగచేస్తోంది.  
 
డిజిటల్ వెర్షన్ లో కట్ చేయని ప్రింట్ ఇస్తానని సందీప్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అనటంతో... కనీసం పది నిమిషాలకు పైగా ఎక్స్ ట్రా ఫుటేజ్ ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే నెట్ ప్లిక్స్ లో ఎక్స్ ట్రా ఫుటేజ్ ఉండకపోవచ్చు అని మరో ప్రక్క వినపడుతోంది.  నెట్‌ఫ్లిక్స్ తాము తీసుకున్న  బాలీవుడ్ సినిమాల విడుదల విషయంలో ఒక సెన్సేషన్ డెసిషన్  తీసుకున్నట్టు వార్తలువచ్చాయి.    కేవలం సెన్సార్ అప్రూవ్ చేసిన థియేటర్ వర్షన్స్ మాత్రమే విడుదల చేయాలని, అన్‌కట్ వర్షన్స్ విడుదల చేయకూడదని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుందట. నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ డెసిషన్  వల్ల ‘యానిమల్’లోని కేవలం రణబీర్ కపూర్, బాబీ డియోల్ ముద్దు సీన్ మాత్రమే కాదు.. అనేక  సీన్స్ ప్రేక్షకుల ముందుకు రాకుండానే మిగిలిపోతాయి.థియేటర్ లో విడుదలైన 3 గంటల 21 నిమిషాల సినిమా ఓటీటీలో మాత్రం ‘యానిమల్’ ఏకంగా 4 గంటల డ్యూరేషన్‌తో విడుదల అవుతుందని వార్తలు నిజం కాకుండా పోతాయి.
  
యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios