Asianet News TeluguAsianet News Telugu

మానసికంగా వేధించిందని రవీనా టాండన్ పై కేసు, పోలీస్ ఎంక్వైరీకి ఆదేశించిన కోర్ట్

  తన చేత బలవతంగా తను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోని రవీనా, ఆమె అబిమానులు బెదిరించి  డిలేట్ చేయించారని పేర్కొన్నాడు. దాంతో కోర్ట్ ...రవనీటాండన్ పై పోలీస్ ఎంక్వీరికి ఆదేశించింది. 

Court orders police inquiry against Raveena Tandon in extortion case jsp
Author
First Published Oct 2, 2024, 8:37 AM IST | Last Updated Oct 2, 2024, 8:37 AM IST


బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆమె ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీని ఫేస్ చేయాల్సిన పరిస్దితి వచ్చింది.  ముంబై బోరివిల్లి మెజిస్ట్రేట్ కోర్ట్  రవీనా టాండన్‌ పై  స్పెషల్ పోలీస్ ఎంక్వరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా  ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసుని ఆమెపై  ఒక స్వతంత్ర జర్నలిస్ట్‌ మొహ్సిన్ షేక్ పెట్టడంతో విచారణలో భాగంగా ఎంక్వీరీకి ఆదేశించింది.  అసలేం జరిగింది, మొహ్సిన్ షేక్ కేసు ఎందుకు పెట్టారనే వివరాల్లోకి వెళితే...

కొద్దిరోజుల క్రితం రవీనా టాండన్‌కు సంబంధించిన వీడియో అంటూ షోషల్‌ మీడియాలో జర్నలిస్ట్‌ పేరుతో మొహ్సిన్ షేక్ షేర్ ‌చేశారు. ఆ వీడియోలో తమపై దాడి చేయకండి అంటూ ఒకరు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఉంది. అందులో ఉన్నది రవీనా టాండన్‌ అని ఆయన పేర్కొనడంతో ఆ వీడియో  నెట్టింట చక్కర్లు కొట్టింది. మద్యం సేవించి డ్రైవర్‌తో పాటు ఆమె ప్రయాణిస్తుందని చెప్పాడు.  ర్యాష్‌ డ్రైవింగ్‌కు వారు పాల్పడటం వల్ల ఆ సమయంలో ముగ్గురు గాయాపడ్డారని, దీంతో వారి బంధువులు వచ్చి రవీనా టాండన్‌పై దాడి చేశారని తెలిపాడు. ఆ సమయంలో తమపై దాడి చేయకండి అంటూ ఆమె వేడుకున్నట్లు వీడియోలో ఉందని తెలిపాడు. 

రవీనా టాండన్ పై తప్పుడు ప్రచారం 

Court orders police inquiry against Raveena Tandon in extortion case jsp


 దీనిపై ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.  అది తప్పుడు సమాచారం అని, రవీనా టాండన్‌ మద్యం తాగలేదని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదుదారు తప్పుడు కేసు పెట్టారని వారు తెలిపారు. రవీనా కారును పార్క్‌ చేసేందుకు డ్రైవర్‌ రివర్స్‌ చేస్తున్న సమయంలో ఓ కుటుంబం నడుచుకుంటూ వెళ్తోంది. కారు వారి దగ్గరకు వెళ్లడంతో డ్రైవర్‌తో వారు గొడవ పెట్టుకున్నారు. అది కాస్త పెద్దగా మారడంతో నటి అక్కడకు చేరకున్నారు. స్థానికుల నుంచి డ్రైవర్‌ను రక్షించే ప్రయత్నంలో రవీనా కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమెపై కూడా వారు గొడవ పడ్డారు. ఆపై వారు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేశారు. కానీ దీనిని సోషల్‌ మీడియాలో రవీనాను కొట్టారని, మద్యం సేవించి కారు నడిపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్‌ అయిందని చెప్పారు.

రవీనా టాండన్ మానసిక వేధింపులుకు గురి చేసింది

రవీనా, ఆమె డ్రైవర్‌ మద్యం సేవించలేదని వారిపై తప్పుడు ఆరోపణలు చేశారని ముంబై పోలీసులు తెలిపారు. పోలీసులు విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తనపై తప్పుడు ప్రచారం చేసిన స్వతంత్ర జర్నలిస్ట్‌కు రూ. 100 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. న్యాయవాది సనా ఖాన్ ద్వారా అతనికి నోటీసులు చేరవేశారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ మొహ్సిన్ షేక్ ..రవీనా టాండన్ కు వ్యతిరేకంగా ఓ కేసు ఫైల్ చేసారు. అందులో ఆమె తనకు వంద కోట్ల పరువు నష్టం నోటీస్ పంపి తనను మానసిక వేధింపులకు గురి చేసారు అని అన్నారు.  తన చేత బలవతంగా తను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోని రవీనా, ఆమె అబిమానులు బెదిరించి  డిలేట్ చేయించారని పేర్కొన్నాడు. దాంతో కోర్ట్ ...రవనీటాండన్ పై పోలీస్ ఎంక్వీరికి ఆదేశించింది. 

Court orders police inquiry against Raveena Tandon in extortion case jsp


కేజీఎఫ్ 2 తో ఫామ్ లోకి వచ్చిన రవీనా టాండన్

రీసెంట్ గా మళ్లీ ఫామ్ లోకి వస్తున్న నటి రవీనా.  కేజీఎఫ్‌-2లో ఈ  స్టార్‌ నటి   కీలక పాత్ర పోషించింది. చివరిసారిగా పట్నా శుక్లా అనే చిత్రంలో లాయర్‌గా కనిపించింది.  రవీనా టండన్‌ ఇప్పుడు సినిమాల జోరు పెంచింది. గతేడాది 'వన్‌ ఫ్రైడే నైట్‌' అనే ఒకే ఒక్క సినిమాతో అభిమానులను పలకరించిన ఈ నటి ఈ ఏడాది 'పట్న శుక్లా' మూవీతో ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'వెల్‌కమ్‌ టు ద జంగిల్‌', 'ఘుడ్చడి' సినిమాలున్నాయి. తాజాగా ఆమె సినీ ఇండస్ట్రీలో ఎంతోకాలంగా కొనసాగుతున్న పారితోషికాల వ్యత్యాసాలపై స్పందించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్‌ నటి వివాదంలో చిక్కుకుంది.
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios