నటుడు శరత్ కుమార్, రాధారవికి కాంచీపురం కోర్టు నోటీసులు అందించింది. ఈ నెల 20న కాంచీపురం కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 

వివరాల్లోకి వెళితే.. శరత్ కుమార్, రాధారవిలు నడిగర్ సంఘానికి అధ్యక్షుడు,సెక్రటరీలుగా ఉన్నప్పుడు సంఘానికి సంబంధించిన స్థలాన్ని అక్రమగా విక్రయించారని ప్రస్తుతం నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. పత్రాలను తారుమారు చేసిన మిగిలిన సభ్యులతో కలిసి స్థలాన్ని అక్రమంగా విక్రయించారని విశాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనికి సంబంధించిన ఆధారాలు పక్కగా ఉంటే విశాల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చని హైకోర్టు సూచించింది. దీంతో ఆయన కాంచీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణకు వచ్చినప్పుడు కేసు దర్యాప్తును ఆలస్యం చేస్తోన్న కాంచీపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మూడు నెలల్లోగా దర్యాప్తును పూర్తిచేసి, నిందితులను అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాజాగా కోర్టు శరత్ కుమార్, రాధారవిలకు కోర్టులో హాజరు కావాలని సమన్లు పంపించింది.