ఈ శుక్రవారం  టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొత్తం చిన్న సినిమాలు సందడి చేసాయి. మార్చ్ 6న ఏకంగా అరడజను చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ హడావిడి మాత్రం థియోటర్స్ దగ్గర కనిపించ లేదు. ఏదీ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నమోదు చెయ్యలేదు. సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ రిలీజ్ చేసిన పలాస ది అదే పరిస్దితి, భవ్య క్రియోషన్స్ వచ్చిన ఓ పిట్ట కథ ది అదే సిట్యువేషన్. ఎంత పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసినా చిన్న సినిమా అంటే ఓపినింగ్స్ రావటం లేదు. హిట్ టాక్ వచ్చాక చూద్దాంలే  థియేటర్స్ వరకు ప్రేక్షకులు రావడం లేదు.

దానికి తోడు సిటీల్లో కరోనా వైరస్ దెబ్బకు అస్సలు కొత్త సినిమాలు చూసే ఆలోచన కూడా చేయడం లేదు జనం. ఈ వారం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. ఓ పిట్టకథ.. పలాస 1978,స్క్రీన్ ప్లే, కాలేజీ కుమార్  సినిమాలు విడుదలయ్యాయి. కానీ అవి వచ్చినట్లు కూడా చాలా మంది ఆడియన్స్‌కు తెలియదు. ఉన్నంతలో మీడియా...పలాస 1978 గురించే మాట్లాడింది. ఆ సినిమాకే కాస్తంత బజ్ వచ్చింది. అయితే అదీ సరిపోదు. 

రిలీజ్ ల విషయం ప్రక్కన పెడితే..కరోనా ప్రభావం తెలుగు సినిమా పరిశ్రమపై పడింది. సినిమా షూటింగులు, థియేటర్లు మూతపడడం వంటి తదితర అంశాలను చర్చించడానికి తెలుగు సినీ ప్రముఖులు రెండు రోజుల క్రితం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. 

షూటింగులు, థియేటర్లు మూసేయ్యడం, షూటింగ్ లొకేషన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై చర్చ జరుగనున్నట్టు సమాచారం. కరోనా కారణంగా ఇప్పటికే పలు షూటింగులు వాయిదా పడ్డాయి. జనాలు ఎక్కువగా వచ్చేది సినిమా థియేటర్లకే కాబట్టి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొద్దిరోజుల పాటు థియేటర్లు మూతపడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఛాంబర్ నిర్ణయం తీసుకోకపోయినా, జనం భయాలతో థియోటర్స్ కు దూరంగా ఉన్నారు.