‘రాధేశ్యామ్‌’ టీమ్ లో కరోనా,షూటింగ్ హాల్ట్?

తాజాగా కరోనా ఎఫెక్ట్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ పై కూడా పడిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్  అనుకున్నట్లుగా జరగలేదు. ఆగిపోయిందని చెప్తున్నారు. 

corona in Prabhas Radhe Shyam team jsp

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నట్లుగానే సినిమాపై బాగా పడుతోంది. షూటింగ్ లు చాలా భాగం ఆగిపోయాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇలా అర్దాంతరంగా షూటింగ్ లు ఆపటం పెద్ద సమస్యగా మారింది. కానీ తప్పటం లేదు. తాజాగా కరోనా ఎఫెక్ట్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ పై కూడా పడిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్  అనుకున్నట్లుగా జరగలేదు. ఆగిపోయిందని చెప్తున్నారు. 

మొదట అందరూ షూటింగ్ ఆగిపోవటానికి కారణం... కొవిడ్ విజృంభణ నేపథ్యంలో హీరోయిన్ పూజా హెగ్డే తాను షూటింగ్‌కు రాలేనని ఖరాఖండిగా చెప్పేసిందని.. అన్నారు. కానీ నిజానికి ప్రభాస్ మేకప్ మ్యాన్‌ కరోనా బారిన పడటంతోనే షూటింగ్ మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశారని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ పాతకాలం లుక్‌లో కనిపించాలి. అందుకు మేకప్ చాలా కీలకం. దాంతో ఇప్పటికిప్పుడు కొత్త మేకప్ మ్యాన్ ని తీసుకున్నా కంటిన్యుటి కష్టం. అందుకే షూటింగ్ ఆపేసి, అతను ఆరోగ్యంగా తిరిగి రావటం కోసం ఎదురుచూస్తున్నారట. 
 
 ఇక ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘జిల్‌’ఫేమ్‌ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తామంటూ, గత కొంతకాలంగా నిర్మాతలు చెబుతూనే ఉండగా, రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కనీసం ఉగాదికైనా విడుదల చేయాలంటూ ఫ్యాన్స్  సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తుండటంతో,  ప్రభాస్ లవ్లీ లుక్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసి ఊరుకున్నారు.

ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తుండగా, మనోజ్‌ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. సచిన్‌ ఖడేకర్‌, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్‌ రాయ్‌ కపూర్‌ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం! జూలై 30న చిత్రాన్ని విడుదల చేస్తామని తేదీని కూడా ప్రకటించినా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడుతుండగా, ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios