#baby కాపీ రైట్ వివాదంలో 'బేబీ' సినిమా కథ
కన్నా ప్లీజ్ టైటిల్‌తో కథ రాసుకున్నట్లు, తరువాత దానికి ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టినట్లు శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సాయిరాజేశ్‌కు చెబితే బాగుందని చెప్పారు.
శ్రీమంతుడు కాపీ రైట్ వివాదం ముగియకుండానే మరొకటి తెరపైకు వచ్చింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యవతను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు సాయి రాజేష్. ఈ సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ సూపర్ హిట్ గా నిలిచింది బేబీ సినిమా ఇక ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం కథ కాపీ వివాదంలో చుట్టుకుంది. ఈ కథ నాదే అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే...ఈ సినిమా కథ తనదేనంటూ సినిమాటోగ్రాఫర్ కమ్ షార్ట్ ఫిలిమ్ డైరక్టర్ శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కథని అనుమతి లేకుండా సినిమా తీశారని చిత్ర నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ పై ఫిర్యాదు చేశారు. శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. 2013లో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని సాయిరాజేశ్ పిలిపించారు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందని. 2015లో కన్నా ప్లీజ్ టైటిల్‌తో కథ రాసుకున్నట్లు, తరువాత దానికి ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టినట్లు శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సాయిరాజేశ్‌కు చెబితే బాగుందని చెప్పారు. తరువాత ఆయన సహకారంతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు గాదెకు కథను వినిపించాను. తరువాత తనకు ఏ మాత్రం చెప్పకుండా 2023లో సాయిరాజేశ్ అదే నిర్మాతతో, తన కథతో బేబీ సినిమా తిసినట్లు తెలిపారు. బేబీ కథ తన ప్రేమించొద్దు కథ ఒక్కటేనని శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదులో వెల్లడించినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.