బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్  రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సుశాంత్ మరణానికి రకరకాల కారణాలు తెర మీదకు వస్తుండటంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే విచారణ ప్రారంభించిన పోలీసులు సుశాంత్ దగ్గర పనిచేసిన వారితో పాటు ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ ను కూడా విచారించారు. అయితే రియాను విచారించిన సందర్భంగా సుశాంత్ యష్ రాజ్‌ఫిలింస్‌తో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నాడని, అదే సమయంలో రియాను కూడా కాంట్రక్ట్ రద్దుచేసుకోవాల్సిందిగా చెప్పాడని వెల్లడించినట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో యష్ రాజ్ ఫిలింస్ ప్రతినిధులను కూడా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ముఖ్యంగా వృత్తి పరంగా సుశాంత్‌కు ఉన్న ఇబ్బందులు, ఇండస్ట్రీలో అతనికి ఎదురైన సమస్య నేపథ్యంలో విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 13 మంది నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరిలో రాజ్‌ఫుత్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు.

అయితే అవకాశాలు కోల్పోయానన్న బాధతోనే సుశాంత్ మరణించాడన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో బాలీవుడ్‌లోని లీడింగ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లను విచారిస్తున్నారు పోలీసులు. ఈ మేరకు గురువారం సుశాంత్‌తో కాంట్రాక్ట్‌కు సంబంధించిన వివరాలు తెలియజేయాలి పోలీసులు యష్‌ రాజ్‌ ఫిలింస్‌కు లెటర్‌ పంపారు. ఆ బ్యానర్‌లో శుద్ధ్‌ దేశీ రొమాన్స్, డిటెక్టివ్‌ భ్యూమకేష్‌ బక్షి సినిమాలు చేసిన సుశాంత్ అదే బ్యానర్‌లో పానీ సినిమా కూడా చేయాల్సి ఉంది. అయితే యష్‌ రాజ్ ఫిలింష్ పానీ సినిమాను తప్పుకోవటంతో మరో నిర్మాత సినిమాను టేకోవర్ చేశాడు.