సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమా నుండి ప్రియాంకా చోప్రా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కత్రినా కైఫ్ ని తీసుకొచ్చారు. అయితే సల్మాన్ తన సినిమా నుండి ప్రియాంక తప్పుకోవడంపై తరచూ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు.

దానికి కారణం ఆమె అదే సమయంలో తన పెళ్లి పెట్టుకుంది. ఈ విషయంపై సల్మాన్ మీడియాలో మాట్లాడుతూ.. 'ఆమె వెళ్లిపోయింది.. మాకు నష్టం ఏమీ కాలేదు. ఆమె మొగుడి కోసం నా సినిమా వదులుకుంది.. నా సినిమా కోసం చాలామంది ఆడవాళ్లు మొగుళ్లనువదిలేసి వస్తారు' అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు సల్మాన్.

ఈ మాటలను ఆయన సరదాగా అన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సల్మాన్.. ప్రియాంక గురించి మాట్లాడడంతో పాటు.. తన సినిమా కోసం ఆడవాళ్లు మొగుళ్లనువదిలేసి మరీ వస్తారని చెప్పడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. 

సల్మాన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతున్నారు. నిజమైన మగాళ్లు ఇలా మాట్లాడరంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ప్రియాంకా.. నిజమైన మగాడి కోసం సినిమా వదులుకుందంటూ సల్మాన్ పై సెటైర్లు వేస్తున్నారు.