సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి తన నటన అందరినీ మెప్పించారు. నిజానికి సినిమాలో మహేష్ పార్టీ మనుషులే ఆయన్ను ఇబ్బందుల్లో పడేస్తారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో అదే పార్టీ చిత్రబృందాన్ని సమస్యలలో నెట్టేసింది. 

నిజానికి ఈ సినిమా కోసం ఉపయోగించిన రాజకీయ పార్టీ పేరు, గుర్తు తమదేనని నవోదయం పార్టీ అధ్యక్షుడు దారి రాము వెల్లడించారు. ఎన్నికల గుర్తింపు కూడా ఉన్న తమ పార్టీ పేరుని సినిమాలో ఎలా వాడతారని ఆయన ఆగ్రహం చెందారు. ఈ విషయంపై ఆయన దర్శకనిర్మాతలకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. మరి ఈ వివాదం నుండి మహేష్ అండ్ టీమ్ ఎలా బయటపడుతుందో చూడాలి!