రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు యువతలో మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి కథలు తమిళంలో ఎక్కువగా వస్తుంటాయి. తమిళ దర్శకులు ఇలాంటి కథలని రియలిస్టిక్ గా తెరకెక్కించడంలో సిద్దహస్తులు. తమిళ దర్శకుడు రామ్ తెరకెక్కించిన 'తరమని' చిత్రం 2017లో తమిళంలో విడుదలయింది. 

ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ఈ చిత్రాన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. సెన్సిటివ్ కంటెంట్ తో యువతని పెడదోవ పట్టించే విధంగా ఈ చిత్రం ఉందంటూ విమర్శిచారు. ఈ చిత్రంలో అంజలి, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. విశాంత్ రవి హీరో. 

ఈ చిత్రం ఎట్టకేలకు తెలుగులో విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంతో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల గత రెండేళ్లుగా ఈ చిత్రం తెలుగులో వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

చెన్నైలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఉపయోగించిన భాషా, బోల్డ్ గా చూపించిన సన్నివేశాలపై అప్పట్లో తీవ్రమైన విమర్శలు తలెత్తాయి.