‘ఆహా కళ్యాణం’ చిత్రంలో నానికి జోడీగా నటించి అలరించిన బాలీవుడ్ భామ వాణీకపూర్. ఆతర్వాత ఈ బ్యూటీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. అయితే ఈ భామ బాలీవుడ్ చిత్రాల్లో హాట్‌హాట్‌గా దర్శనమిచ్చి యూత్‌ను మైమరపిస్తోంది. అయితే ఈమధ్య ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు.  అయితేనేం హఠాత్తుగా తెలుగు మీడియాలో వార్తల్లో కనపబడింది. కారణం ఏమిటా అంటే వాణీ కపూర్ కు కరోనా వచ్చిందని ఆ వార్త. ఛండీగ‌ఢ్‌లో ఆయుష్మాన్ ఖురానా, వాణికపూర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే హీరోయిన్ వాణీకపూర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని… ఇక దీనితో తిరిగి షూటింగ్ మొదలు పెట్టాలా వద్దా అన్న విషయంపై డైరెక్టర్ అభిషేక్ కపూర్ డైలమాలో ఉన్నాడని ఆ వార్త సారాంశం. 

అంతేకాకుండా వాణీకపూర్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష నిర్వహించగా ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదటగానే ఉంది… కానీ, ప్రస్తుతానికి అభిషేక్ ఆయుష్మాన్ ఖురానా కొన్ని రోజులపాటు క్వారంటైన్ లో ఉండబోతున్నారు. వాణి కపూర్ తిరిగి కోలుకున్న తర్వాత కూడా ఆమె షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు లేకపోతే ఆయుష్మాన్ ఖురానా సోలో సీన్లు చిత్రీకరించాలన్న ఆలోచనలో ఉంది చిత్రయూనిట్ అని ఆ వార్తను మరింత ముందుకు తీసుకెళ్లారు.

బాలీవుడ్ మీడియా కూడా ఈ విషయమై భారీ ఎత్తున ఎక్సక్లూజివ్ అంటూ న్యూస్ లు స్ర్పెడ్ ఛేసింది. అయితే అసలు అలాంటిదేమీ లేదని  బాలీవుడ్ కు చెందిన మరో మీడియా సంస్ద జూమ్ స్పష్టం చేసింది. అంతేకాదు వాణి కపూర్ సైతం..తనకు కరోనా రాలేదనే విషయాన్ని డైరక్ట్ గా చెప్పకుండా తాను షూటింగ్ కు ప్రిపేర్ అవుతున్నట్లు ఓ ఫొటో తన ఇనిస్ట్ర ఎక్కౌంట్ లో షేర్ చేసింది. అయితే మరి ఈ కరోనా సోకిందనే వార్త ఎలా స్ర్పెడ్ అయ్యినట్లో అర్దం కాలేదు. గడిచిన ఎనిమిది నెలలుగా క‌రోనా వైరస్ దేశ వ్యాప్తంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని ప్రభావంతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి.