హాలీవుడ్ చిత్రాలు టెక్నికల్ గానూ, కథాంశాలను ఎంచుకోవటంలోనూ మనకన్నా ఎప్పుడూ ఓ పదేళ్ల ముందే ఉంటుందనే విషయం మనకు తెలుసు. ఇప్పుడా విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ గురించి ఓ హాలీవుడ్ చిత్రం పదేళ్ళ క్రితమే చెప్పిందంటే ఆశ్చర్యం అనిపిస్తోంది కదూ. కానీ ఇది నిజం. మాట్ డామన్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో, కేట్ విన్‌స్లెట్, మైఖేల్ డగ్లస్‌ వంటి స్టార్స్ నటించిన కంటేజియన్ అనే ఈ సినిమాలో కథ ఇలాంటి ఓ వైరస్ గురించే. ఇంతకీ ఆ కథేంటి అంటారా

ఒక బిజినెస్ మ్యాన్ హఠాత్తుగా విజృంభించిన ఓ ప్రమాదకర వైరస్ బారిన పడి చనిపోతారు. చైనా పర్యటనలో ఉన్నప్పుడు  ఆ వైరస్ సోకుతుంది. తర్వాత ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీస్తుంది. ఇప్పుడు జరుగుతోంది ఇదే కదా. 
  
అలాగే సినిమాలో ఆ వైరస్ ...గబ్బిలం ద్వారా వ్యాప్తి చెందతుంది.  ఆ వైరస్ ఓ పందికి సోకుతుంది. ఆ పంది మాంసాన్ని తాకిన ఓ హాంగ్‌కాంగ్ చెఫ్‌... ప్రధాన పాత్రకు షేక్‌హ్యాండ్ ఇవ్వటంతో ఆ వైరస్ సంక్రమిస్తుంది. ఆ తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయాక తీవ్ర అనారోగ్యానికి గురై, కొద్ది రోజులకే చనిపోతారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె కుమారుడు కూడా చనిపోతారు. ఆమెకు భర్తగా నటించిన మాట్ డామన్‌లో రోగనిరోధక శక్తి ఎక్కువగా  ఉండటంతో ఆయన ప్రాణాలతో బయటపడతారు. కరోనా కూడా ఇలాగే షేక్ హ్యాండ్ ల వల్ల వస్తోంది. అలాగే రోగ నిరోధక శక్తి ఉన్నవాళ్లు బ్రతుకుతున్నారు.

వైరస్ వ్యాప్తితో భారీగా ప్రాణ నష్టంతో జరుగుతుందని సినిమాలో చూపించారు. అయితే అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగటం లేదు. కానీ ఇలా భవిష్యత్ ని ఓ పదేళ్ల ముందే ఊహించటం చాలా గొప్ప విషయం కదా. మీరేమంటారు. అవకాసం ఉంటే ఈ సినిమా చూడండి..