మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో స్పైడర్ దసరా కానుకగా రానున్న స్పైడర్ సినిమాపై కుట్ర జరుగుతోందన్న ప్రచారం
ప్రిన్స్ మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం స్పైడర్. ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు రూ.130కోట్ల బిజినెస్ చేసింది. అయితే.. ఈసినిమాపై భారీ కుట్ర జరుగుతోందనే టాక్ వినపడుతోంది. అందుకు కారణంగా చిత్ర యూనిట్ కి సంబంధం లేకుండా ట్రైలర్ రిలీజ్ కావడమే.
ఈరోజు సాయంత్రం స్పైడర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనే సినిమా ట్రైలర్ ని విడుదల చేద్దామని భావించారు. కానీ అకస్మాత్తుగా ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ చిత్ర బృందం విడుదల చేయలేదట. ఎవరో లీక్ చేసి విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
పలువరు అగ్ర హీరోల సినిమాల్లోని కొన్ని సీన్లు విడుదలకు ముందే లీకైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి స్పైడర్ కూడా చేరింది. ఇది చెన్నైలో వాళ్లు చేశారా లేదా హైదరాబాద్ లో వాళ్లు చేశారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి తోడు.. ‘జై లవ కుశ’ తో పోలిస్తే.. స్పైడర్ ఆ రేంజ్ లో ఆకట్టుకునే విధంగానూ లేదని పలువురు భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్ విషయంలోనూ డైరెక్టర్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదనేది మహేష్ అభిమానుల వాదన.
