Asianet News TeluguAsianet News Telugu

సైరా కాన్ఫిడెన్స్ లెవెల్ సాహోలో  మిస్ : వార్ తో ఢీ

సాహూ చిత్ర యూనిట్ కి వారి కంటెంట్ పైన అంత విశ్వాసం లేకనే సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్టు కనపడుతుంది. అదే సైరా సినిమాను చూస్తే, వారి కాన్ఫిడెన్సు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. 

confidence: the difference between saaho and syeraa
Author
Hyderabad, First Published Sep 28, 2019, 10:35 AM IST

250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన పీరియాసిక్ డ్రామా సైరా అక్టోబర్ 2వ తేదీన విడుదలవుతుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది.గాంధీ జయంతినాడు థియేటర్లలో విడుదలవబోతుంది. మొన్న విడుదల చేసిన ట్రైలర్ ఈ చిత్రం పై అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసింది.  ఫస్ట్ సాంగ్ ఆడియో కూడా అదరగొట్టి ఆల్రెడీ చార్ట్ బస్టర్ల లిస్టులోకెక్కింది. 

దాదాపుగా ఒక నెలకింద ఇదే స్థాయి భారీ బడ్జెట్ తో రూపొందించిన మరో బహుభాషా చిత్రం సాహూ విడుదలయ్యింది. తొలుత ఆగష్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కాకపోతే అదే రోజు మరో రెండు చిన్న సినిమాలు మిషన్ మంగళ్, బాట్ల హౌస్ విడుదలవనున్న నేపథ్యంలో సినిమా విడుదలను ఆగష్టు 29కి వాయిదా వేశారు. 

మరోపక్క సైరా చిత్రాన్ని చూస్తుంటే అనుకున్న డేట్ అక్టోబరు 2వ తేదీనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అదే రోజు హిందీలో మరో భారీ చిత్రం వార్ విడుదల కానుంది. పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ సెక్వెన్సులతో అక్కడి మాస్ ఆడియన్స్ ను కూడా చేరుకోగలుగుతుంది. అయినా కూడా ఏ మాత్రం సంశయం లేకుండా ఆ చిత్రం తోని ఢీ అంటే ఢీ అంటూ అక్టోబర్ 2నే చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 

చిన్న సినిమాల తోనే పోటీ అయినా సాహూను వాయిదా వేశారు. ఇంకో విచిత్రం ఏమిటంటే, మిషన్ మంగళ్ కానీ బట్ల హౌస్ కానీ  మాస్ సినిమాలు కావు. కేవలం ఏ సెంటర్ ఆడియన్స్ మాత్రమే చూసే సినిమాలు. బి,సి సెంటర్లలో ఇలాంటి సినిమాలు ఆడవు. అయినా సాహూ చిత్ర బృందం సినిమా విడుదలను వాయిదా వేసుకుంది.

 ఈ పరిస్థితులను బట్టి చూస్తే సాహూ చిత్ర యూనిట్ కి వారి కంటెంట్ పైన అంత విశ్వాసం లేకనే సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్టు కనపడుతుంది. అదే సైరా సినిమాను చూస్తే, వారి కాన్ఫిడెన్సు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కథ, కథనం మీద అంత నమ్మకం ఉండబట్టే మరో భారీ చిత్రాన్ని ఢీకొనడానికి వెనకాడట్లేదు సైరా చిత్ర బృందం. 

దానికి తోడు సైరా చిత్ర ప్రమోషన్లు ఇంకా అధికారికంగా ప్రారంభమవ్వకుండానే ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మన రాష్ట్రం, పక్క రాష్ట్రం అని తేడా లేకుండా విదేశాల్లో సైతం వీరి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 

ప్రమోషన్లు విరివిగా చేసేదే బజ్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ వాటి అవసరం లేకుండానే బజ్ భారీ స్థాయిలో క్రియేట్ అయ్యింది. వార్ సినిమా ఊసే వినిపించట్లేదు ఎక్కడా! సైరా చిత్ర బృందం కాన్ఫిడెన్స్, ఫాన్స్ సపోర్ట్ వీటన్నింటిని చూస్తుంటే సైరా రికార్డులను తిరిగిరాస్తుందనిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios