Asianet News TeluguAsianet News Telugu

‘ల‌వ్ టుడే’తెలుగులో షాకింగ్ కలెక్షన్స్ ...ఎంతంటే

ఊరు,పేరు తెలియని ఓ తమిళ మామూలు హీరోకు ఈ రేంజి ఓపినింగ్స్ ఎవరూ ఊహించరు. ఈ సినిమా అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం ఇందులో సగం కూడా రాలేదని ట్రేడ్ లో వినపడుతోంది.
 

Comedy entertainer Love Today telugu box office collection
Author
First Published Nov 26, 2022, 2:25 PM IST


త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘ల‌వ్ టుడే’. ప్రదీప్ రంగ‌నాథ‌న్ స్వయంగా ర‌చించి, ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఆయ‌నే హీరోగా చేసారు. ఈ జనరేషన్ యూత్ ఆలోచ‌న‌లు, వాళ్ల ప్రేమ‌ల్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాని తెలుగులో దిల్‌రాజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆస‌క్తి రేకెత్తించే  ట్రైల‌ర్, దిల్‌రాజు సంస్థ నుంచి విడుద‌ల‌వుతుండ‌డంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు త‌గ్గట్టుగానే సినిమాకు ఓపినింగ్స్ వచ్చాయి. నిన్న రిలీజైన తోడేలు, ఇట్లు మారేడుమిల్లి నియోజక వర్గం కన్నా ఈ సినిమానే బెస్ట్ ఓపినింగ్స్ అందుకుంది.

ఈ తమిళ డబ్బింగ్  సినిమా  ‘ల‌వ్ టుడే’ తెలుగులో బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా మొదటిరోజు 2.45 కోట్లు తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ వసూలు చేసింది.  ఊరు,పేరు తెలియని ఓ తమిళ మామూలు హీరోకు ఈ రేంజి ఓపినింగ్స్ ఎవరూ ఊహించరు. ఈ సినిమా అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం ఇందులో సగం కూడా రాలేదని ట్రేడ్ లో వినపడుతోంది.

ఈ జనరేషన్ ప్రేమ‌లు, వాళ్ల సెల్‌ఫోన్ అల‌వాట్లనే నేప‌థ్యంగా ద‌ర్శకుడు ఈ క‌థ‌ని అల్లుకున్నాడు. ప్రేక్షకుల‌కు వెంట‌నే క‌నెక్ట్ అయ్యే క‌థ ఇది. మ‌నం ఏమిట‌నేది మ‌న ఫోన్లే చెబుతాయ‌నేది త‌ర‌చూ వినిపించే మాట‌. ఆ అంశాన్ని రెండు జంట‌ల‌తో ముడిపెట్టి  ఫన్నీగా క‌థ‌నాన్ని తీర్చిదిద్దిన  విధానం బాగుంది. ప‌ది నిమిషాల్లోనే క‌థ‌లో లోకి వెళ్ళిపోతారు. హీరో,హీరోయిన్స్  ఫోన్లు మార్చుకున్నాక అస‌లు కాంప్లిక్ట్ మొద‌ల‌వుతుంది. అప్పటిదాకా ఒకరికొక‌రు ఎలా క‌నిపించారు? సెల్‌ఫోన్లలో ఒక‌రు చేసిన ఛాటింగ్‌ని మ‌రొక‌రు చూశాక, ఒక‌రి బ్రౌజింగ్ హిస్టరీ మ‌రొక‌రు చూశాక ఒక‌రి అల‌వాట్లు మ‌రొక‌రికి తెలిసిన త‌ర్వాత వాళ్లు ఎలా మారారు? ఆ క్రమంలో పండే హాస్యం, భావోద్వేగాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. 

తమిళంలో ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి నటించిన లవ్ టుడే చిత్రం తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫ్యాన్సీ రేటును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 2.7 కోట్లకు దిల్ రాజు తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 3 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.
 
లవ్ టుడే తెలుగు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ కావడంతో భారీ అంచనాలతో రిలీజైంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 285 థియేటర్లకుపైగా రిలీజ్ చేశారు. నైజాంలో ఈ సినిమా 150కిపైగా, సీడెడ్‌లో 60కి పైగా థియేటర్లలో, ఆంధ్రాలో 180కి పైగా థియేటర్లలో రిలీజ్ చేశారని ట్రేడ్ టాక్.
 

Follow Us:
Download App:
  • android
  • ios